సాధారణంగా యువ హీరోలు రొటీన్ ఫార్ములాతో కెరీర్‌ను మొదలుపెడుతుంటారు. ఇలా కెరీర్ షురూ చేసిన వారిలో సక్సెస్ అయిన వాళ్లు కొందరు, సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నవారు మరికొందరు. కానీ కొందరు యాక్టర్లు మాత్రం కెరీర్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుని.. ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారి జాబితాలో ముందువరుసలో ఉంటాడు యువ నటుడు తేజ సజ్జ (Teja Sajja) .
తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి.. ప్రస్తుతం హీరోగా తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్నాడు. తేజ సజ్జ చేస్తున్న సినిమాలు గమనిస్తే.. ఇతడు కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టు అర్థమవుతుంది. మొదట సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబి చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు తేజ సజ్జ . ఈ సినిమాలో తేజ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత హీరోగా తొలిసారే ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్లో ప్రయోగాత్మక సినిమా జాంబిరెడ్డిలో నటించాడు. ఈ మూవీ కూడా డిఫరెంట్ కథాంశం కావడంతో చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోలో హీరోగా తేజ సజ్జకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇపుడు రెండోసారి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో హనుమాన్ సినిమాతో వస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన టీజర్ పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విజువల్స్ తో సాగుతుంది. తేజ సజ్జ కెరీర్ ప్లాన్ కోసం పక్కా రూట్ మ్యాప్ ఎలా క్రియేట్ చేసుకున్నాడో చెప్పేందుకు ఈ ఒక్క టీజర్‌తో క్లారిటీ వచ్చేస్తుందంటున్నారు సినీ జనాలు.
Read Also : Jai Balayya Mass Anthem | వీరసింహారెడ్డి నుంచి జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్.. ఫ్యాన్స్ కు పండగే
Read Also : Vijay Deverakonda | ముంబైలో విజయ్ దేవరకొండ.. కొత్త అప్డేట్ ఏంటో తెలుసా..?
Read Also : Read Also : Yashoda | కోర్టు తీర్పుతో ఆలస్యంగా రానున్న యశోద