Yashoda | కోర్టు తీర్పుతో ఆలస్యంగా రానున్న యశోద
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన యశోద (Yashoda) బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. కాగా సరోగసీ చుట్టూ జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్ పోషించిన చిత్రం యశోద (Yashoda). తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. కాగా సరోగసీ చుట్టూ జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఈవా ఐవీఎఫ్ హాస్పిటల్ యశోద మేకర్స్ పై హైదరాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించింది. సినిమాలో తమ ఆస్పత్రిని నెగెటివ్ యాంగిల్లో చూపించారని, యశోదను నిలిపేయాలని కోరారు. యశోద ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. డిసెంబర్ 19 వరకు యశోదను ఓటీటీలో విడుదల చేయొద్దని మేకర్స్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 19కు వాయిదా వేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో యశోద ఓటీటీలో ఆలస్యంగా రానుంది.
యశోద డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించారు. యశోద చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ తెరకెక్కించారు. ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
సమంత యాక్షన్ సీన్ల మేకింగ్ వీడియో..
యశోద ట్రైలర్ ..
Read Also : Vijay Deverakonda | ముంబైలో విజయ్ దేవరకొండ.. కొత్త అప్డేట్ ఏంటో తెలుసా..?
Read Also : Devi Sri Prasad | బాస్ పార్టీ సాంగ్‌పై ట్రోల్స్.. దేవీ శ్రీ ప్రసాద్ నో కామెంట్స్ !
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్‌కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

