ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మూవీ లవర్స్‌కు, తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో మరపురాని సినిమాలు అందించి సూపర్‌స్టార్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు దివంగత నటుడు కృష్ణ (Super star krishna). ఆయన మృతిపట్ల యావత్ సినీ లోకం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. తండ్రి మరణం తర్వాత మహేశ్ బాబు (Mahesh Babu) భావోద్వేగ పూరిత సందేశాన్ని అందరితో పంచుకున్నాడు.
కృష్ణ తన జీవితాన్ని చాలా ఆనందంగా, ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా గడిపారు. నాకు స్పూర్తినిచ్చిన విషయాలన్నీఆయనతోనే వెళ్లిపోయాయి. గతంలో ఎన్నడూ లేని బలం నాలో ఉన్నట్టు అనిపిస్తోంది. నాకిప్పుడు ఎలాంటి భయం లేదు. మీ (కృష్ణ) తేజస్సు నాలో ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తా. లవ్ యూ నాన్న.. మై సూపర్ స్టార్.. అంటూ సందేశాన్ని ముంగించాడు మహేశ్ బాబు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 సినిమాలో నటిస్తున్నాడు మహేశ్‌బాబు. ఇప్పటికే షురూ కావాల్సిన కొత్త షెడ్యూల్ షూటింగ్ కృష్ణ మృతితో నిలిచిపోయింది.
మహేశ్‌బాబు భావోద్వేగపూరిత సందేశం..
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్‌కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?