టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) రీసెంట్గా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) నుంచి బాస్ పార్టీ సాంగ్‌తో అభిమానుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఊరమాస్‌గా కలర్ఫుల్గా సాగుతున్న ఈ పాటను రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)కంపోజ్ చేయడమే కాదు.. స్వయంగా రాశాడు.
అయితే పాటను చాలా మంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా.. పాట మొదట్లో వచ్చే లిరిక్స్ మాత్రం మ్యూజిక్ లవర్స్ కు నచ్చలేదనే టాక్ ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో జోరుగా నడుస్తోంది. ఈ లిరిక్స్ నచ్చని కొంతమంది డీఎస్పీని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే డీఎస్పీ మాత్రం ఈ ట్రోల్స్ పై నో కామెంట్స్ అంటూ.. సైలెన్స్ గా ఉంటున్నాడు. సాధారణంగా సినిమా అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయని తెలిసిందే.
ప్రేక్షకుల అటెన్షన్‌ను తమవైపు తిప్పుకోవడానికి ప్రతీ సినిమా టీం ఏదో ఒక ప్రయోగం చేయడం జరిగిదే. కొన్నిపాటలు యూట్యూబ్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉండి.. థియేటర్లకు వచ్చే సరికి ఉండవు. మరి మాస్ ఆడియెన్స్ పల్స్ తెలిసిన డీఎస్పీ కేవలం ప్రమోషన్ కోసమే ఇలా చేశాడా..? థియేటర్ వెర్షన్లో వచ్చే సాంగ్‌లో ఈ లిరిక్స్ ఉండవా..? అనేది తెలియాల్సి ఉంది.
ఏదేమైనా చిరు మాస్ ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా పాటలు కంపోజ్ చేయడంలో డీఎస్పీ స్టైలే వేరనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..
బాస్ పార్టీ సాంగ్ ప్రోమో.. వీడియో
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
Read Also : Vijay Deverakonda | ముంబైలో విజయ్ దేవరకొండ.. కొత్త అప్డేట్ ఏంటో తెలుసా..?
Read Also : Read Also : Yashoda | కోర్టు తీర్పుతో ఆలస్యంగా రానున్న యశోద
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్‌కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?