e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News సినిమాల‌ సందడి మొదలైంది.. సెప్టెంబర్ నుంచి వ‌రుసపెట్టి రిలీజ్‌లు

సినిమాల‌ సందడి మొదలైంది.. సెప్టెంబర్ నుంచి వ‌రుసపెట్టి రిలీజ్‌లు

చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ సినిమాల సందడి కనిపిస్తుంది. కాస్త పేరున్న సినిమాలతో మొదలైన సందడి.. ఇప్పుడు పెద్ద సినిమాల వరకు వచ్చింది. మరీ ముఖ్యంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచి పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 3న గోపీచంద్ సీటీమార్ వస్తుంది. ఆ తర్వాత వరసగా పెద్ద సినిమాలు క్యూ కడుతున్నాయి. బయట పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో స్టార్ హీరోలు వెనక్కి తగ్గుతున్నారు. కానీ కొందరు మీడియం బడ్జెట్ సినిమాల నిర్మాతలు మాత్రం ధైర్యం చేసి తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. సెకండ్ వేవ్ లో వచ్చిన సినిమాలలో SR కళ్యాణ మండపం, రాజ రాజ చోర లాంటి సినిమాలు విజయం సాధించాయి కూడా.

దాంతో మళ్లీ థియేటర్స్ వైపు దండయాత్రకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు. సెప్టెంబర్ 10న వినాయకచవితి సందర్భంగా లవ్ స్టోరీ సినిమా విడుదల కానుంది. అదే రోజు నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను 40 కోట్లకు సొంతం చేసుకుంది. మరోవైపు నితిన్ మాస్ట్రో కూడా సెప్టెంబర్ లోనే హాట్ స్టార్ డిస్నీలో విడుదల కానుంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ అక్టోబర్ 1న ముహూర్తం ఖరారు చేసుకుంది. వారం తర్వాత ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న కొండ పొలం సినిమా విడుదల కానుంది. అక్టోబర్ 8న దీనికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

- Advertisement -

బాలయ్య అఖండ సినిమా సైతం అదే సమయంలో విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక నాగ శౌర్య వరుడు కావలెను లాంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అసలే కరోనా కారణంగా చాలా నష్టపోయారు నిర్మాతలు. అందుకే ఒకరితో ఒకరు మాట్లాడుకున్న తర్వాతే విడుదల తేదీలు అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం.. కచ్చితంగా సెప్టెంబర్ లో థియేటర్స్ మోతెక్కిపోవడం ఖాయం. అక్టోబర్ లో ట్రిపుల్ ఆర్ కూడా రావడం అనుమానంగానే ఉంది. అందుకే మరిన్ని సినిమాలు కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. అయితే అక్టోబర్ లో థర్డ్ వేవ్ కరోనా ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది కూడా నిర్మాతలను భయపెడుతుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Sridevi Soda Center Review| శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ

అమితాబ్ బ‌చ్చ‌న్ బాడీగార్డ్ ఏడాది సంపాద‌న కోటిన్న‌ర‌.. పోలీస్ డిపార్ట్‌మెంట్ చ‌ర్య‌లు

Mouni Roy: మాల్దీవుల్లో మౌనీ రాయ్‌.. ఇన్‌స్టాలో బీచ్ ఫోటోలు

Nani: అమెజాన్ ప్రైమ్‌లో ట‌క్ జగదీష్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Alludu Garu: అల్లుడు గారు రీమేక్‌పై క‌న్నేసిన హీరో ఎవ‌రంటే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana