న్యూఢిల్లీ: టీవీ నటి మౌనీ రాయ్ ( Mouni Roy )తన ఇన్‌స్టాలో కొత్త ఫోటోలను పోస్టు చేసింది. బికినీ డ్రెస్సులో ఉన్న ఆ ఫోటోల్లో మౌనీ చాలా కూల్‌గా ఉంది. ఇటీవల మాల్దీవులకు వెళ్లిన ఆ స్టార్ .. అక్కడ దిగిన ఫోటోలను తాజాగా అప్లోడ్ చేసింది. గ్రే కలర్ బికినీలో ఆమె ఫోటోలకు ఫోజు ఇచ్చింది. బీచ్‌లో ఓ షీట్‌పై పడుకుని, పుస్తకం చదువుతున్నట్లు మౌనీ రాయ్ ఆ ఫోటోలో కనిపిస్తోంది. బయట చాలా వేడిగా ఉందని, ఏదో పాట వింటూ ఇలా కాలక్షేపం చేస్తున్నట్లు మౌనీ తన ఫోటోకు కామెంట్ పెట్టింది. క్యోంకీ సాస్ బీ కబీ బహూ తీ, దేవోంకా దేవ్ మహాదేవ్, జునూన్, నాగిని లాంటి టీవీ సీరియళ్లలో నటించింది. ఎన్నో రియాల్టీ షోల్లోనూ మౌనీ యాక్ట్ చేసింది.