e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News Sridevi Soda Center Review | శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ

Sridevi Soda Center Review | శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ

Sridevi Soda Center Review | కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యతకు ప్రాధాన్యతనిస్తుంటారు సుధీర్‌బాబు (Sudheer Babu). ఘనమైన సినీ నేపథ్యం ఉన్నా ఇమేజ్‌ జోలికి పోకుండా నటుడిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటివరకు పట్టణ నేపథ్య కథాంశాల్లోనే ఎక్కువగా నటించిన సుధీర్‌బాబు తొలిసారి పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకొని చేసిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌ ‘ (Sridevi Soda Center). పలాస చిత్రంతో విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న కరుణకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మణిశర్మ, శ్యాందత్‌సైనుద్దీన్‌, శ్రీకర్‌ప్రసాద్‌ లాంటి అగ్ర సాంకేతిక నిపుణులు భాగం కావడంలో ప్రారంభం నుంచే తెలుగు ప్రేక్షకుల్లో ఈసినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగినట్లుగా సినిమా ఉందా..? తన పంథాకు భిన్నంగా సుధీర్‌బాబు చేసిన ప్రయత్నం ఫలించిందా? ద్వితీయ విఘ్నాన్ని దర్శకుడు కరుణకుమార్‌ అధిగమించాడా? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…

Sridevi Soda Center Review

కథ ఏంటంటే..

అమలాపురం సమీప గ్రామాల్లో ఎలక్ట్రీషియన్‌గా సూరిబాబు(సుధీర్‌బాబు) మంచి పేరు సంపాదించుకుంటాడు. సిటీలో ఎలక్ట్రికల్‌ షాప్‌ ఓపెన్‌ చేయాలన్నది అతడి కల. ఊరి చేపల చెరువు విషయంలో తన స్నేహితుడు దుర్గారావుకు(సత్యం రాజేష్‌)అండగా నిలుస్తాడు సూరిబాబు. ఈ క్రమంలో ఊరిపెద్ద అయిన కాశీతో(నవగీతన్‌) సూరిబాబుకు శత్రుత్వం మొదలవుతుంది. ఊరి జాతరలో శ్రీదేవిని(ఆనంది) (Anandhi) చూసి తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు సూరిబాబు. సూరిబాబు మంచితనాన్ని గ్రహించిన శ్రీదేవి అతడిని ఇష్టపడుతుంది. కానీ సూరిబాబు తమ కులానికి చెందిన వాడు కాకపోవడంలో శ్రీదేవి తండ్రి(నరేష్‌) వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. వారిద్దరినీ విడదీయడానికి కాశీ సహాయాన్ని కోరుతాడు. సూరిబాబుపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న కాశీ తప్పుడు హత్య కేసుతో అతడిని జైలుకు పంపిస్తాడు. జైలుకు వెళ్లిన సూరిబాబు శ్రీదేవి ప్రేమ కోసం ఏం చేశాడు? కాశీని ఎలా ఎదుర్కొన్నాడు? సూరిబాబుతో తన కూతురు ప్రేమలో పడటం నచ్చిన శ్రీదేవి తండ్రి పరువు కోసం ఎలాంటి బలీయమైన నిర్ణయం తీసుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

సూరిబాబు, శ్రీదేవిల ప్రేమకథతో..

- Advertisement -

కుల అంతరాలతో ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. పరువు, ప్రతిష్టల కోసం పాకులాడుతూ కొందరు తీసుకునే నిర్ణయాలు ఎలాంటి విషాదాలకు దారితీస్తాయో కమర్షియల్‌ హంగులను మేళవిస్తూ సందేశాత్మకంగా సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. పరువు అనేది జనాల అభిప్రాయాలను బట్టి కాదు మనిషి మనసుల్ని బట్టి ఉంటుందనే పాయింట్‌తో సినిమాను రూపొందించారు. సూరిబాబు, శ్రీదేవిల ప్రేమకథతో ప్రథమార్థం ఆహ్లాదభరితంగా సాగుతుంది. సూరిబాబు, కాశీ మధ్య వైరానికి దారితీసిన సన్నివేశాల్ని దర్శకుడు వినూత్నంగా తీర్చిదిద్దారు. తమ ప్రేమను అడ్డుకోవడానికి కాశీ వేసే ప్లాన్స్‌ను సూరిబాబు తిప్పికొడుతూ సాగించే పోరాటంతో ద్వితీయార్థాన్ని ఉత్కంఠగా మలిచారు. పతాక ఘట్టాలు హృద్యంగా సాగుతాయి. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో మాదిరిగా యాక్షన్‌ ఘట్టాలతో కాకుండా ఎమోషనల్‌గా దర్శకుడు తీర్చిదిద్దారు. క్లైమాక్స్‌లో వచ్చే సంభాషణలు ఆలోచనను రేకెత్తిస్తాయి.

ఎవరెలా చేశారంటే..

సూరిబాబుగా సుధీర్‌బాబు చక్కటి నటనను కనబరిచాడు. ఎలక్ట్రీషియన్‌ పాత్రకు తగినట్లుగా తన హావభావాల్ని, బాడీలాంగ్వేజ్‌, యాసను మార్చుకుంటూ నటించారు. ఉద్వేగభరిత సన్నివేశాల్లో పరిణతి కనబరిచారు. ఇప్పటివరకు ఎక్కువగా అర్బన్‌ బేస్‌డ్‌ సినిమాల్లో నటించిన సుధీర్‌బాబు పల్లెటూరి ఇతివృత్తాలకు సరిపోతాడని నిరూపించిన చిత్రమిది. శ్రీదేవిగా ఆనంది సహజ నటనతో ఆకట్టుకున్నది. కూతురు ప్రేమ, పరువు మధ్య నలిగిపోయే సగటు మధ్య తరగతి తండ్రిగా నరేష్‌ పాత్ర ఈ సినిమాకు కీలకంగా నిలిచింది. క్లైమాక్స్‌ సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. డైలాగ్‌లతోనే చక్కటి విలనిజాన్ని పండించారు నవగీతన్‌. రఘుబాబు, సత్యంరాజేష్‌ పాత్రల ద్వారా కామెడీతో పాటు ఎమోషన్స్‌ను పండించారు దర్శకుడు.

గోదావరి యాసలో కొత్త అనుభూతి..

నాగేంద్రకాశీ అందించిన కథకు తనదైన శైలి సంభాషణలు, స్క్రీన్‌ప్లేతో విభిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కరుణకుమార్‌. గోదావరి యాస, ప్రాంత సొగసులకు పెద్దపీట వేస్తూ సినిమాను రూపొందించడం కొత్త అనుభూతినిచ్చింది. కరుణకుమార్‌ సంభాషణలు బాగున్నాయి. సామాజిక ఇతివృత్తాన్ని వాణిజ్య హంగులతో చెప్పడం కత్తిమీదసాములా ఉంటుంది. కానీ కరుణకుమార్‌ మాత్రం వివాదాల జోలికి పోకుండా సున్నితంగా సినిమాను మలిచారు. ఈ కథలో కొత్తదనం లేకపోవడం సినిమాకు మైనస్‌గా నిలిచింది. కుల అంతరాలు, పరువు హత్యలతో సైరాట్‌, దొరసాని, పావ కథైగల్‌తో పాటు వివిధ భాషల్లో పలు సినిమాలొచ్చాయి. రొటీన్‌ అంశాన్ని ఎంచుకొని కరుణకుమార్‌ ఈ సినిమా చేశారు. సుధీర్‌బాబు, ఆనంది కెమిస్ట్రీ సరిగా వర్కవుట్‌ కాలేదు. జైలు నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలన్నీ నెమ్మదిగా సాగి బోర్‌ కొట్టిస్తాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడు మణిశర్మ, ఛాయాగ్రాహకుడు శ్యాందత్‌ అసలైన హీరోలుగా నిలిచారు. మణిశర్మ స్వరపరచిన పాటలతో పాటు నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. గోదావరి అందాలను కొత్తగా శ్యాందత్‌ ఈ సినిమాలో చూపించారు.

ఎలా ఉంది…?

రెగ్యులర్‌ లవ్‌స్టోరీకి భిన్నంగా సాగే చిత్రమిది. కమర్షియల్‌ హంగుల జోలికి పోకుండా తాము చెప్పాలనుకున్న కథను దర్శకనిర్మాతలు నిజాయితీగా తెరపై ఆవిష్కరించారు. ఈ ప్రేమకథను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో వేచిచూడాల్సిందే.

రేటింగ్‌ : 2.5/5

Rating: 2.5 out of 5.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Sridevi Soda Center Review| శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ

అమితాబ్ బ‌చ్చ‌న్ బాడీగార్డ్ ఏడాది సంపాద‌న కోటిన్న‌ర‌.. పోలీస్ డిపార్ట్‌మెంట్ చ‌ర్య‌లు

Mouni Roy: మాల్దీవుల్లో మౌనీ రాయ్‌.. ఇన్‌స్టాలో బీచ్ ఫోటోలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana