నా తమ్ముడు కార్తి సినిమా హిట్టవుతుంది: నాగార్జున
కార్తి , నాగార్జున | ఐదేళ్ల కింద ఇద్దరూ ఊపిరి సినిమాలో కలిసి నటించారు. అందులో అద్భుతమైన నటనతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు నాగార్జున, కార్తి.

బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారంటే కచ్చితంగా పోటీతత్వం అనేది ఉంటుంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడటం సహజం. బరిలో ఉన్న అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు నాగార్జున కూడా ఇదే చేశాడు. ఈయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను సోలమన్ రూపొందించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, టీజర్స్ ఆసక్తి పెంచేశాయి. మరోవైపు ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నాడు నాగార్జున. ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు కొన్ని ఎంటర్టైన్మెంట్ షో లకి కూడా వస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగార్జునతో పాటు కార్తి కూడా అదే రోజు వస్తున్నాడు.

ఈయనకు కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తి సినిమాలకు దాదాపు రూ.10 కోట్ల మార్కెట్ ఉంది. దాంతో నాగార్జున సినిమాకు కచ్చితంగా పోటీ తప్పదు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కార్తి సుల్తాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర చూపించడం ఖాయం. ఇప్పుడు తమ ఇద్దరి మధ్య పోటీపై నాగార్జున కూడా స్పందించాడు. కార్తి సినిమా విజయం సాధించాలని.. ఖచ్చితంగా సుల్తాన్ సూపర్ హిట్ అవుతుంది అంటూ చెప్పాడు. తన తమ్ముడు సినిమా విజయం సాధిస్తే తాను కూడా ఆనందంగా ఉంటాను అంటున్నాడు.
ఐదేళ్ల కింద ఇద్దరూ ఊపిరి సినిమాలో కలిసి నటించారు. అందులో అద్భుతమైన నటనతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు నాగార్జున, కార్తి. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ ఇద్దరి మధ్య అదే రిలేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ నాగార్జున ఎక్కడ కలిసిన కూడా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తాడు కార్తి. మరోవైపు నాగార్జున కూడా ఈ తమిళ హీరోపై అదే ఆప్యాయత చూపిస్తాడు. అలాంటి ఇద్దరు హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. అది కూడా స్నేహపూర్వక వాతావరణంలో వస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
‘ఆచార్య’ లాహే లాహే సాంగ్ ప్రోమో విడుదల
వకీల్ సాబ్: పవన్ కళ్యాణ్ దెబ్బకు రికార్డులు షేక్
పవన్ తో వర్క్ చేయడంపై ఇస్మార్ట్ భామ ఏమన్నదంటే..?
సీక్రెట్ డ్రింక్ షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్
హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ ఫుల్ స్టంట్: క్రిష్
బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన వకీల్ సాబ్ ట్రైలర్
చిన్నారితో బాలకృష్ణ హోలీ సెలబ్రేషన్స్..స్టిల్ వైరల్
జాన్వీకపూర్ హ్యాండ్ బ్యాగ్స్..చాలా కాస్లీ గురూ
కాలేజీకి వెళ్లలేదు..లవ్‌స్టోరీలు కనెక్ట్ కావు : రానా
లవ్ స్టోరీ విడుదల వాయిదా..? మేకర్స్ క్లారిటీ
రామ్‌సేతులో అక్షయ్ కుమార్ లుక్ ఇదేనా ?
కారు ప్రమాదంలో యువ గాయకుడు మృతి
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
‘వైల్డ్ డాగ్’ సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉండబోతుంది?
రెండు సాంప్రదాయాలలో మెహ్రీన్ కౌర్ వివాహం..!
పొట్టి దుస్తులలో అనసూయ హోలీ సంబురాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

