సల్మాన్ ఖాన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బజరంగీ భాయ్‌జాన్. విజయేంద్రప్రసాద్ అందించిన యూనివర్సల్ కథాంశాన్ని, సున్నిత భావోద్వేగాలను డైరెక్టర్ కబీర్ ఖాన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. అయితే ఈ కథ మొదట రాజమౌళికి చెప్పారట విజయేంద్ర ప్రసాద్.
కానీ అప్పటికే బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్సయ్యాడట రాజమౌళి. ఇక విజయేంద్ర ప్రసాద్ ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ను సంప్రదించడం, కబీర్ ఖాన్ తో సినిమా చేయించడం వెంట వెంటనే జరిగిపోయాయి. బజరంగీ భాయ్‌జాన్ రిలీజ్ అయ్యాక ఇండియన్ సినీ హిస్టరీలో నిలిచిపోయే సినిమాగా రికార్డుల వర్షం కురిపించింది.
అయితే బజరంగీ భాయ్‌జాన్ విడుదలైన అనంతరం సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్సయ్యానని రాజమౌళి కొన్ని నెలలపాటు బాధపడ్డారని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్.
ఇవి కూడా చదవండి..
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?