బూర్గంపహాడ్, ఏప్రిల్ 2 : కార్మికుల సమస్యలపై యాజమాన్యం దృష్టి పెట్టకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, ఎండీ యాకూబ్పాషాలు స్పష్టం చేశారు. వేతన ఒప్పందంతోపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు సారపాక ఐటీసీ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 8వ రోజుకు చేరాయి.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ 13వ వేతన ఒప్పంద కాలం పూర్తయినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని, 14వ వేతన ఒప్పంద ప్రక్రియనైనా జేఏసీతో కలిసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మికులతో కలిసి చర్చలకు రానైట్లెతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. దీక్షల్లో కూర్చున్న వారిలో కడారి జయరాం, రేపల్లి చంద్రశేఖర్, బొక్కా సత్యనారాయణ, అలుగోలు నాగరాజు, ముళ్లపూడి వెంకటసత్యనారాయణ, వెలిశెట్టి సత్యనారాయణ, మిట్టకంటి రవీంద్రారెడ్డి, మోతుకూరు ముత్యాలరావు, బూయన్న వెంకటేశ్వర్లు జేఏసీ సభ్యులు ఆకిని సర్వేశ్వరరావు, ఈతకోటి జాన్సన్, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, మిరియాల రాము పాల్గొన్నారు.