తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టు లవ్ స్టోరీ (Love Story). టాలీవుడ్ (Tollywood) లో విడుదల కాబోతున్న ఆసక్తికర చిత్రాల్లో ఒకటి. ఇవాళ మేకర్స్ విడుదల చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఇద్దరు యువతీ యువకులు ఎటువంటి లక్ష్యంతో గ్రామీణ నేపథ్యం నుంచి పట్నం వచ్చారు. ఆ తర్వాత ఎలా ప్రేమలో పడ్డారు..? వారిద్దరి జీవితాల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయనే కథాంశంతో శేఖర్ కమ్ముల ( Sekhar Kammula) ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) నటన సినిమాకే హైలెట్ గా నిలువబోతుందని తెలిసిపోతుంది. ఈ ట్రైలర్ పై నాగచైతన్య భార్య, హీరోయిన్ సమంత (Samantha) స్పందించింది. లవ్ స్టోరీ ట్రైలర్ ను విజేతగా అభివర్ణించింది సామ్. నాగచైతన్య ట్వీట్ కు స్పందించిన సామ్ అతడి గురించి ఏం ప్రస్తావించకుండా సినిమా ట్రైలర్ విన్నర్ అంటూ..సాయిపల్లవిని ట్యాగ్ చేస్తూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేసింది.
కొంతకాలంగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే సామ్ నాగచైతన్య ట్వీట్ కు రీ ట్వీట్ చేస్తూ..ఆల్ ది బెస్ట్ చెప్పడంతో అలాంటిదేమి లేదు కావొచ్చు అంటూ అందరూ తెగ గుసగుసలాడుకుంటున్నారు.
ట్రైలర్ పై ఓ లుక్కేయండి మరి..
నాగచైతన్య, సమంత 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చైతూ సినిమాలు, ట్రైలర్స్ పై ఎప్పుడూ తన అభిప్రాయాన్ని అందరితో పంచుకుంటుంది సామ్. నాగచైతన్య దీంతోపాటు హిందీలో అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చధా సినిమా చేస్తున్నాడు. మరోవైపు రాశీఖన్నాతో థాంక్యూ చేస్తున్నాడు.
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!