Director Nag Ashwin | కల్కి టైటిల్ వెనక అసలు కథ ఏంటో తెలుసా.. దర్శకుడు నాగ్ అశ్విన్ ఏమన్నారంటే?
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898ఏడీ’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Director Nag Ashwin | ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898ఏడీ’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ పురాణేతిహాసం మహాభారతం, సైన్స్ అంశాల కలబోతగా ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ దర్శకుడు నాగ్అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వీఎఫ్ఎక్స్ సదస్సులో పాల్గొన్న నాగ్అశ్విన్ ‘కల్కి’ సినిమా కథ తాలూకు పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చాడు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రాన్ని ఉదహరించిన ఓ జర్నలిస్ట్ ‘హాలీవుడ్ ‘డ్యూన్’ సినిమాతో ‘కల్కి’కి ఏమైనా సంబంధం ఉందా?’ అని ప్రశ్నించగా, దీనిపై నాగ్అశ్విన్ స్పందిస్తూ ‘రెండు చిత్రాల పోస్టర్స్‌లో ఇసుక బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంది.
అందుకే పోలిక తీసుకొస్తున్నారు. నిజానికి రెండూ పూర్తి భిన్నమైన కథలు’ అని చెప్పారు. సినిమా టైటిల్ గురించి నాగ్అశ్విన్ మాట్లాడుతూ ‘మహాభారతం చివర్లో మొదలై రానున్న 2898 ఏడీలో ముగిసే కథ ఇది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. 6000 ఏళ్ల కాలవ్యవధి వరకు నడిచే కథ ఇది’ అని వివరించారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

