Baak | బాక్ కథేంటి? తనేం చేసింది?.. థియేట్రికల్ ట్రైలర్ విడుదల
‘అరణ్మనై’ సిరీస్ నుంచి రానున్న నాలుగవ చిత్రం ‘అరణ్మనై 4’. ఈ చిత్రం ‘బాక్' పేరుతో మే 3న తెలుగులో విడుదల కానుంది.
Baak | ‘అరణ్మనై’ సిరీస్ నుంచి రానున్న నాలుగవ చిత్రం ‘అరణ్మనై 4’. ఈ చిత్రం ‘బాక్’ పేరుతో మే 3న తెలుగులో విడుదల కానుంది. సుందర్.సి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశీఖన్నా కథానాయికలు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్‌కుమార్ నిర్మాతలు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘ వినోదమే ప్రధానంగా రూపొందిన చిత్రం ‘బాక్’.
కుటుంబప్రేక్షకులను కూడా నచ్చే సినిమా ఇది. చిన్నపిల్లల నుంచి మహిళల వరకూ అందరినీ అలరించిన సిరీస్ ‘అరణ్మనై’. ఈ సినిమాతో మరో సూపర్‌హిట్ ఇవ్వనున్న మా దర్శకుడు సుందర్.సికి థ్యాంక్స్. దర్శకుడు చెప్పింది అర్థం చేసుకొని నటించే ఆర్టిస్టులు ఈ సినిమాకు కుదిరారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అస్సామీ జానపదంలో ‘బాక్’ అనే దెయ్యం ఉండేదని ఈ స్క్రిప్ట్ రీసెర్చ్‌లో సుందర్ తెలుసుకున్నారు. అసలు ఆ ‘బాక్’ కథేంటి? తనేం చేసింది? అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’ అని ఖుష్బు సుందర్ చెప్పారు. ఇంకా తమన్నా, రాశీఖన్నా, కోవైసరళ, నిర్మాత జాన్వీ నారంగ్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

