Mahesh Babu | ఇంట్రెస్టింగ్ అప్డేట్.. మహేశ్, రాజమౌళి సినిమా షూటింగ్ షురూ చేసేది ఆరోజే
మహేశ్, రాజమౌళి సినిమాపై వస్తున్న అప్డేట్లు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ఈ సినిమా గురించి పలు వేదికల్లో కథారచయిత విజయేంద్రప్రసాద్ కొన్ని లీకుల్ని ఇచ్చారు.
Mahesh Babu | మహేశ్, రాజమౌళి సినిమాపై వస్తున్న అప్డేట్లు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ఈ సినిమా గురించి పలు వేదికల్లో కథారచయిత విజయేంద్రప్రసాద్ కొన్ని లీకుల్ని ఇచ్చారు. తాను, రాజమౌళి దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్‌కు పెద్ద అభిమానులమని, ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ స్క్రిప్ట్‌ని రాశామని ఆయన ఓ వేదికపై చెప్పిన విషయం తెలిసిందే. హనుమంతుని లక్షణాలతో ఇందులో మహేశ్ పాత్రను రాజమౌళి డిజైన్ చేసినట్టు సమాచారం.
ఇదిలావుంటే.. ఇందులో మహేశ్‌కు జోడీగా ఓ విదేశీభామ నటిస్తున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. తాజా సమాచారం మేరకు ఆమెతో పాటు అలియాభట్ కూడా ఇందులో భాగం కానున్నదట. మరి ఆమెది హీరోయిన్ పాత్రా? లేక ప్రత్యేక పాత్రా? అనేది తెలియాల్సివుంది. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రెస్‌మీట్‌ని మేకర్స్ నిర్వహించనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి.
అలాగే మహేశ్ పుట్టినరోజైన ఆగస్ట్ 9న పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్‌కు శ్రీకారం చుట్టాలని రాజమౌళి భావిస్తున్నారట. ఎస్.ఎస్.రాజమౌళి మార్క్ కథనంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. కె.ఎల్.నారాయణ ఈ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ సినిమాకు నిర్మాత.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

