e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News Rana Malayalam Remake| మ‌రో మలయాళం రీమేక్‌లో రానా..?

Rana Malayalam Remake| మ‌రో మలయాళం రీమేక్‌లో రానా..?

అనారోగ్య కారణాలతో కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రానా ( rana ) దగ్గుబాటి. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ ఏడాది ఇప్పటికే అరణ్య సినిమాతో వచ్చాడు దగ్గుబాటి వారసుడు. ఇప్పుడు మరో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న మల్టీస్టారర్ సెట్స్ పైనే ఉంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలకు కూడా ఓకే చెప్పాడు రానా. ఇదిలా ఉంటే తాజాగా మరో మలయాళం రీమేక్ సినిమాకు రానా ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అద్భుతమైన స్పందన తెచ్చుకున్న మాలిక్( malik remake ) సినిమాను తెలుగులో రానా హీరోగా రీమేక్ చేయాలని చూస్తున్నారు. అక్కడ స్టార్ హీరోగా వెలిగిపోతున్న ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో నటించాడు. లాక్ డౌన్ పుణ్యమా అని వరసగా ఓటీటీ రిలీజ్ లతో ఫహాద్ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈయన హీరోగా నటించిన మాలిక్ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు.

- Advertisement -

మత ఘర్షణలు, రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఫహద్ యాక్టింగ్‌ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తెలుగు రీమేక్ లో రానా నటిస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు తెలుగు రీమేక్ రైట్స్ తీసుకోడానికి సన్నాహాలు చేస్తున్నారు కూడా. నిజానికి ఈ స్టోరీ రానాకి చాలా సూట్ అవుతుంది. విలక్షణ పాత్రలతో మెప్పించే రానాకు ఇలాంటి రోల్ ఇస్తే చంపేస్తాడంతే అంటున్నారు అభిమానులు. దాంతో బయటి వాళ్ళు ఎందుకని సురేష్ ప్రొడక్షన్స్ రీమేక్ హక్కులు కొనడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి మాలిక్ రీమేక్ రానా చేస్తే ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

Karan Johar Fear| భ‌య‌ప‌డుతున్న‌ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు

Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్

Pooja Hegde Akkineni Akhil | అఖిల్ ను కాపాడేది పూజాహెగ్డే మాత్ర‌మే..?

దోస్తి వీడియో సాంగ్ ఐడియా ఎవ‌రిదో చెప్పిన రాజ‌మౌళి

Vedhika Kumar look | వేదిక‌ స్ట‌న్నింగ్ లుక్‌కు నెటిజ‌న్లు ఫిదా….వీడియో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana