Pooja Hegde Akkineni Akhil | అఖిల్ ను కాపాడేది పూజాహెగ్డే మాత్రమే..?
అఖిల్ సినిమాతో తెరంగేట్రం చేశాడు అక్కినేని అఖిల్ ( Akkineni Akhil ). ఇప్పటివరకు సరైన సక్సెస్ లేని ఈ హీరోను కాపాడేది ఒక్క పూజాహెగ్డే ( Pooja Hegde ) మాత్రమేనని అంతా అనుకుంటున్నారు.

అఖిల్ సినిమాతో తెరంగేట్రం చేశాడు అక్కినేని అఖిల్ ( Akkineni Akhil ). ఆ తర్వాత సోలో హీరోగా మరో మూడు చిత్రాల్లో నటించాడు.కానీ ఈ సినిమాలేవి అఖిల్ కు ఆశించిన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దీంతో ఎలాగైనా సరే ఈ సారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ( Most Eligible Bachelor ) చిత్రంతో తానేంటో నిరూపించుకోవాలని కసిగా ఎదురుచూస్తున్నాడు అఖిల్. సరైన సక్సెస్ ఈ యువ హీరో తలుపు తట్టకపోవడంతో ఈ సారైనా అఖిల్‌కు బ్రేక్ వస్తుందా..? లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అక్కినేని అభిమానులు.
అయితే అఖిల్ స్పీడుమీదున్నప్పటికీ కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను వెంటాడుతూ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ చిత్రాన్నిఎప్పుడు విడుదల చేయబోతున్నారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ పరిస్థితి ఏంటి అని ఆందోళన పడుతున్న అక్కినేని ఫాలోవర్స్ కు..కంగారు పడకండి ఇక్కడ నేనున్నానంటూ భరోసా ఇస్తుంది పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ( Pooja Hegde ).

కొంతకాలం పూజాహెగ్డే నటించిన సినిమాలు బాక్సాపీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటుండం చూస్తూనే ఉన్నాం. ఈ భామ కాలు పెట్టిందంటే ఆ చిత్రం హిట్టయినట్టేనని అంతా అనుకుంటున్నారు. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు పూజాహెగ్డే హీరోయిన్ గా ఉండటంతో సినిమా విజయాన్ని అందుకోవడం ఖాయమని అనుకుంటున్నారు ట్రేడ్ పండితులు.
హీరోహీరోయిన్లలో ఎవరి క్రేజ్ మీదనైనా సినిమా హిట్టయినా..అది అఖిల్, పూజాహెగ్డే ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. మరి చూడాలి పూజామంత్ర అఖిల్ సినిమాకు ఎలా పనిచేస్తుందో. ఇక పూజాహెగ్డే ప్రస్తుతం పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న భారీ ప్రాజెక్టు రాధేశ్యామ్ లో నటిస్తోంది. దీంతోపాటు, ఆచార్య, బీస్ట్, హిందీలో భాయ్‌జాన్ చిత్రాలతో బిజీగా ఉంది.
ఇవి కూడా చదవండి..
Varma Enemyship Day | ‘ఎనిమీషిప్ డే ’సెలబ్రేషన్స్ లో వర్మ..అదేంటి..?
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

