హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ బస్సులను నడుపుతున్నామని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నది. గురువారం హైదరాబాద్ లక్డీకపూల్ స్టాఫ్ వద్ద ఆర్టీసీ బస్సు నుంచి మహిళను దింపివేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశంపై శుక్రవారం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్టు తెలిపింది.
ఫుట్‌బోర్డుపై నిల్చొని ప్రయాణిస్తున్న మహిళను.. సైడ్ మిర్రర్ కనిపించేందుకు వీలుగా బస్సు లోపలికి రావాలని పలుసార్లు సూచించినప్పటికీ ఆమె వినిపించుకోలేదేని తెలిపింది. దీంతో డ్రైవర్ సత్యనారాయణ బస్సును నిలిపివేసి, లక్డీకపూల్‌లోని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారని యాజమాన్యం స్పష్టంచేసింది. మహిళను బస్సులోంచి దింపేసినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది.