ఖలీల్‌వాడి, మే 10: లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గెలువబోతున్నాడని తెలిసి.. బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేర కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుట్రలు చేస్తున్నారని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆరోపించారు. సజ్జనార్‌ది నేర స్వభావమని ధ్వజమెత్తారు. నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్య ర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు.
సజ్జనార్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆర్మూర్‌లోని తన షాపింగ్ మాల్‌లోకి 200 మందిని పంపించిహంగామా చేశారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. తన మాల్‌కు సంబంధించిన బకాయిలు రూ.7.24 కోట్లు ఆర్టీసీకి ఇప్పటికే చెల్లించామని, ఆయినా రూ.8 కోట్లు బాకీ ఉన్నట్టు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక నుంచి సజ్జనార్‌ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయనున్నారని అందుకే ఇదంతా చేస్తున్నాడని వెల్లడించారు.