టాలీవుడ్ (Tollywood) యాక్టర్ రవితేజ (Ravi Teja) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్రావు (Tiger Nageswara Rao). ఈ సినిమా ఉగాది పండుగ సందర్భంగా గ్రాండ్‌గా లాంఛ్ కానుంది. ఇప్పటికే ఏప్రిల్ 2న ముహూర్తం ఫిక్స్ చేయగా..అదే రోజు మధ్యాహ్నం 12:06 గంటలకు స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను మేకర్స్ అందించారు. బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ (Kriti Sanon) సోదరి నుపుర్ సనన్ (Nupur Sanon) ఈ చిత్రంలో ఫీ మేల్‌లీడ్ రోల్ పోషిస్తోంది. నుపుర్ సనన్ తొలిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీవీప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. 1970లో స్టూవర్ట్ పురంలో పేరు పొందిన ధైర్యసాహాసాలు కలిగిన దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా తెరకెక్కుతుందీ చిత్రం.
. @NupurSanon would be joining @RaviTeja_offl for the Massive Hunt in #TigerNageswaraRao 🔥@DirVamsee @abhishekofficl @gvprakash @madhie1 @kollaavinash @SrikanthVissa @MayankOfficl @AAArtsOfficial @UrsVamsiShekar @TNRTheFilm pic.twitter.com/iVHywoQkv7
— BA Raju's Team (@baraju_SuperHit) March 31, 2022
నుపుర్ సనన్ తొలిసారి అర్వింద్ ఖైరా డైరెక్ట్ చేసిన ఫిల్హాల్-2 మ్యూజిక్ వీడియోతో కెమెరా ముందుకొచ్చింది. పంజాబీ హిందీ వెర్షన్ లో తెరకెక్కించిన ఈ పాటలో నుపుర్ సనన్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించాడు. మహేశ్ బాబుతో వన్ నేనొక్కడినే చిత్రంలో నటించింది కృతిసనన్.