ఆర్ఆర్ఆర్తో ఇంటర్నేషనల్ స్టార్డమ్ సంపాదించాడు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR). తారక్ ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో ఒకటి పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel)తో చేయబోతున్న ఎన్టీఆర్ 31 (NTR 31) ప్రాజెక్టు. మరోవైపు కొరటాల శివతో చేయనున్న సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే దానిపై ఇప్పటివరకు అప్డేట్ రాలేదు.
ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడు మొదలవబోతుందనే న్యూస్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. వచ్చే ఏడాది చివరలో ప్రారంభం కానుందట. అంతేకాదు ఈ చిత్రంలో తారక్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నామని, ఇందులో ఒకటి విలన్ పాత్ర అని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న సలార్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఇప్పటికే కొరటాల సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. జనతాగ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.