బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 16:26:10

ఆది పురుష్ లో ల‌క్ష్మ‌ణుడు ఇత‌డే..!

ఆది పురుష్ లో ల‌క్ష్మ‌ణుడు ఇత‌డే..!

స్టార్ హీరో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆదిపురుష్ చిత్రంలో న‌టిస్తున్న విషయం తెలిసిందే. తానాజీ ఫేం ఓం రావ‌త్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తోండ‌గా..బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. సీత పాత్ర‌లో ప‌లువురు హీరోయిన్ల పేర్లు తైర‌పైకి రాగా..తాజాగా కృతిస‌నన్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టులో మ‌రో ముఖ్య‌మైన పాత్ర ల‌క్ష్మ‌ణుడు. క‌థానుగుణంగా చాలా ప్రాధాన్య‌ముండే ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ఓ అప్ డేట్ బీటౌన్ లో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్యార్ కా పంచ్‌నామా, సోనూ కే టిటూ కీ స్వీటీ వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు బాలీవుడ్ న‌టుడు సన్నీ సింగ్‌. ఈ హీరోనే ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌కు ఎంపిక చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. మ‌రి ప్ర‌భాస్ ప‌క్క‌నే స‌న్నీసింగ్ ఎంత‌వ‌ర‌కు సెట్ అవుతాడ‌నేది రానున్న రోజుల్లో తెలియ‌నుంది. సన్నీ సింగ్ సెలెక్ష‌న్ పై కూడా చిత్ర‌యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. జ‌న‌వ‌రి లో ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo