The Great Pre Wedding Show | జార్జిరెడ్డి, పలాస 1978 ఫేం తిరువీర్ (Thiruveer) నటించిన తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (The great pre wedding Show). టీనా శ్రావ్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ నవంబర్ 7న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటుంది.
ఇక ఫైనల్‌గా టీవీ ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయింది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో జీ తెలుగులో టెలివిజన్ ప్రీమియర్ కానుంది. డిసెంబర్ 14న సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుంది. ఫీల్ గుడ్ డ్రామాను ఎంజాయ్ చేసే టీవీ ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీలో రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్ ఇతక కీలక పాత్రల్లో నటించారు.
రాహుల్ శ్రీనివాస్ కథనందిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ మరి టీవీలో ఎలాంటి రేటింగ్స్ నమోదు చేస్తుందని ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు తిరువీర్. ఐశ్వర్యా రాజేశ్‌తో కలిసి నటిస్తోన్న సినిమా ఒకటి షూటింగ్ దశలో ఉంది.
Ajay Bhupati | అజయ్ భూపతి – జయకృష్ణ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్… క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
OTT Movies | అఖండ2 సైడ్ ఇవ్వడంతో దూసుకొచ్చిన చిన్న సినిమాలు.. ఓటీటీలోను సందడే సందడి
Salman Khan | బిగ్ బాస్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సల్లూభాయ్.. కారణం ఏంటంటే..!