Salman Khan | వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ హిందీ సీజన్–19 గ్రాండ్ ఫినాలే ఆదివారం రాత్రి ముగిసింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్లో ప్రముఖ టీవీ నటుడు గౌరవ్ ఖన్నా విజేతగా నిలిచారు. ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచారు. ఫినాలేలో సల్మాన్ ఖాన్ ఇద్దరినీ ఫైనల్ టూగా ప్రకటించిన అనంతరం ఖన్నా చేతిని పైకెత్తి సీజన్ విన్నర్‌గా ప్రకటించారు.గౌరవ్ ఖన్నా సీజన్ మొత్తం పాజిటివ్ నెస్, టాస్క్‌లలో అద్భుతంగా పర్ఫార్మ్ చేయడం, హౌస్ వివాదాలకు దూరంగా ఉండటం వంటి కారణాలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయనకు బిగ్ బాస్ సీజన్ 19 ట్రోఫీతో పాటు ₹50 లక్షల ప్రైజ్ మనీ కూడా లభించింది. విజేతగా నిలిచిన వెంటనే అభిమానులు, సినీ,టీవీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే ఫినాలే కార్యక్రమంలో ఒక భావోద్వేగ క్షణం చోటుచేసుకుంది. గతంలో బిగ్ బాస్ షోలో ధర్మేంద్ర పాల్గొన్న వీడియోను ప్రదర్శించగా, సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. “మనం హీ-మ్యాన్ ను కోల్పోయాం… ఆయనకు సరితూగే వారు ఎవరూ లేరు” అంటూ భావోద్వేగంగా కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోలలో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా బిగ్ బాస్ సీజన్‌ని సక్సెస్ ఫుల్‌గా నడుపుతున్నారు.
ఇకపోతే తెలుగులో కూడా ఈ షో 9వ సీజన్ సక్సెస్ ఫుల్‌గా జరుగుతున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజులలో తెలుగు బిగ్ బాస్ షోకి కూడా పులిస్టాప్ పడనుంది. ఈ సారి తనూజ లేదంటే కళ్యాణ్‌లలో ఒకరు విన్నర్ అవుతారని అందరు భావిస్తున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్లో రీతూ చౌదరి ఎలిమినేట్ కాగా, ఆమె చాలా ఎమోషనల్ అయింది. అస్సలు ఊహించలేదని, ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నందుకు ఆనందం వ్యక్తం చేసింది.