Ajay Bhupati | ‘ఆర్ఎక్స్ 100’ , ‘మహాసముద్రం’ లాంటి విభిన్న కథలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి చిత్రాన్ని ఘట్టమనేని కుటుంబ వారసుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ అధికారిక అప్డేట్ విడుదల చేయడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, తదుపరి షూటింగ్ షెడ్యూల్లో భాగంగా తిరుపతిలో భారీ సెట్టింగ్ వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల–తిరుపతి నేపథ్యంలో నడిచే కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ ఎపిసోడ్ షూట్ పూర్తయిన వెంటనే, జయకృష్ణపై ప్రత్యేకంగా సాంగ్ చిత్రీకరించనున్నారట. త్వరలోనే ఈ సాంగ్ పనులు మొదలు కానున్నాయి. ఆ పాట కోసం కూడా ప్రత్యేక సెట్లు సిద్ధం చేస్తున్నారు.
జయకృష్ణ డెబ్యూ కావడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది. స్టార్ కుటుంబ వారసుడు రావడంతో పాటు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో అంచనలు మరింత ఎత్తుకు చేరాయి. సినిమా కథ తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. విష్ణు స్వయంభుగా అవతరించిన ఈ పవిత్ర స్థలంలో జరిగిన ఒక ప్రత్యేకమైన సంఘటన ఆధారంగా కథ నిర్మించబడిందట.ఇది పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్, భావోద్వేగాలతో నిండిన డ్రామాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉందని టీమ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ సీనియర్ స్టార్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులో అరంగేట్రం చేయబోతున్నారు. యువ నటి రాషా .. జయకృష్ణతో కలిసి కొత్త ఫ్రెష్‌నెస్ తీసుకురానున్నారు.
జెమిని కిరణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై రూపొందుతోంది. భారీ నిర్మాణ విలువలతో, ఆధ్యాత్మిక నేపథ్యంతో, భావోద్వేగపు కథతో ఈ సినిమా టాలీవుడ్లో ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అనౌన్స్మెంట్ రేపు ఉదయం 10.08ని.లకి రానుంది. దాని కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి జయకృష్ణ తొలి సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి… కానీ ఇప్పటివరకు అయితే ప్రాజెక్ట్ పై భారీ బజ్ నెలకొంది!