OTT Movies | ప్రతివారం కూడా థియేటర్‌తో పాటు ఓటీటీలోను ప్రేక్షకులకి మంచి వినోదం దొరుకుతుంది. అయితే డిసెంబర్ 5న అఖండ 2 విడుదల కావల్సి ఉండగా, ఆ చిత్రం అనివార్యకారణాల వలన ఆగిపోయింది. దీంతో చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో కార్తీ నటించి అన్నగారు వస్తారు డిసెంబర్ 12న రిలీజ్‌కి సిద్ధమైంది. ఇందులో కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి సందడి చేయనున్నాడు. ఇక నందు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం సైక్ సిద్ధార్థ. వరుణ్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సుమ తనయుడు రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా రూపొందిన మోగ్లీ 2025 చిత్రం కూడా డిసెంబర్ 12న రిలీజ్ కానుంది.
ఘంటసాల గురించి ఈ తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో సిహెచ్ రామారావు ఘంటసాల అనే చిత్రాన్ని కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలో రూపిందించారు. ఈ మూవీని డిసెంబర్ 12నే విడుదల చేస్తున్నారు. ఈషా అనే థ్రిల్లర్ చిత్రం, మిస్ టీరియస్ అనే సస్పెన్స్ థ్రిల్లర్, నా తెలుగోడు అనే చిత్రం, ఇట్స్ ఓకే గురు అనే మూవీస్ కూడా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈవారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. థ్రిల్లర్ కంటెంట్ ను ఇష్టపడే ఆడియన్స్ ఈ వీక్ పండగ చేసుకోవడం గ్యారెంటీ
నెట్‌ఫ్లిక్స్‌లో
మాన్ వర్సెస్ బేబీ వెబ్‌సిరీస్ డిసెంబర్ 11
గుడ్‌బై జూన్ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12
సింగిల్ పాపా హిందీ సిరీస్ డిసెంబర్ 12
వేక్ అప్ డెడ్ మాన్ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12
అమెజాన్ ప్రైమ్
మెర్వ్ ఒరిజినల్ మూవీ డిసెంబర్ 10
టెల్ మీ సాఫ్ట్లీ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12
జియో హాట్‌స్టార్
సూపర్‌మ్యాన్ హాలీవుడ్మూవీ (తెలుగులో) డిసెంబర్ 11
ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ హిందీ చిత్రం డిసెంబర్ 12
జీ 5
సాలీ మొహబ్బత్ హిందీ చిత్రం డిసెంబర్ 12
ఆహా
ది హంటర్: చాప్టర్-1 (రణం అరం తవరేల్): తమిళ క్రైమ్ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్). ఇది క్రైమ్ థ్రిల్లర్ (ఈటీవీ విన్‌తో పాటు ఆహాలో కూడా స్ట్రీమింగ్ కావచ్చు).
త్రీ రోజెస్ ( తెలుగు సిరీస్) డిసెంబర్ 12
వీటితో పాటు ఈ వీకెండ్ డిసెంబర్ 13-15 నాటికి మరింత కొత్త కంటెంట్ ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా హిందీ, తమిళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ మూవీస్ ఎక్కువగా విడుదలవుతున్నాయి.