September Movies | సెప్టెంబర్లో సినిమాల జాతర..క్యూలైన్ లో ఉన్న సినిమాలివే..!
చాలా రోజుల నుంచి భారీ తెలుగు సినిమాలు (Big Telugu Movies) విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు కానీ బయట పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో వెనక్కి తగ్గుతున్నారు.

చాలా రోజుల నుంచి భారీ తెలుగు సినిమాలు (Big Telugu Movies) విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు కానీ బయట పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో వెనక్కి తగ్గుతున్నారు. అయినా కూడా కొందరు చిన్న నిర్మాతలు ధైర్యం చేసి తమ సినిమాలను విడుదల చేసారు. అందులో SR కళ్యాణమండపం లాంటి సినిమాలకు మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఈ చిత్రం మూడు రోజుల్లోనే చాలా చోట్ల సేఫ్ జోన్ కు రావడంతో నిర్మాతలకు ధైర్యం వచ్చింది. అందుకే ఓటిటికి ఇవ్వాలనుకున్న టక్ జగదీష్ లాంటి సినిమాలను కూడా మనసు మార్చుకుని మళ్లీ థియేటర్స్ (Theatres) వైపు మళ్లిస్తున్నారు నిర్మాతలు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో మూడు షోలకు మాత్రమే అనుమతి ఉంది.
దాంతోపాటు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ నడుస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో ఏకంగా 5 షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేక తలలు పట్టుకుంటున్నారు నిర్మాతలు. అందుకే ఆగస్ట్ కాకుండా సెప్టెంబర్ లో వరస సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 10న వినాయకచవితి ఉంది. అప్పట్నుంచి మీడియం బడ్జెట్ (Medium Budjet Movies) సినిమాలను విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం నాని టక్ జగదీష్..నాగ చైతన్య లవ్ స్టోరీ..గోపీచంద్ సీటీమార్..రానా విరాట పర్వం.. సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్.. నాగ శౌర్య వరుడు కావలెను లాంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
వీటన్నింటినీ కూడా పరిస్థితులకు తగ్గట్లు సెప్టెంబర్ లోనే విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరితో ఒకరు మాట్లాడుకున్న తర్వాతే విడుదల తేదీలు అనౌన్స్ చేసేలా కనిపిస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం..కచ్చితంగా సెప్టెంబర్ లో థియేటర్స్ మోతెక్కిపోవడం ఖాయం. అక్టోబర్ లో ట్రిపుల్ ఆర్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఏ నిర్మాత కూడా తమ సినిమాలను విడుదల చేయకుండా ఉండలేరు. అందుకే దానికి ముందే వీలైనంత వరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడే ప్రేక్షకుల ముందుకు తమ సినిమాలను తీసుకురావాలని చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

