Kiran Abbavaram | టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ క (KA). పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుజిత్-సందీప్ డైరెక్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 31న దీపావళి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేశాడు కిరణ్ అబ్బవరం. క విశేషాలు హీరో మాటల్లోనే..
కథ గురించి ఏం చెప్తారు..?
సందీప్-సుదీప్ అంచనా వేయలేని ట్విస్టులతో కథను రెడీ చేశారు. 70స్ బ్యాక్ డ్రాప్లో సాగే తాజా అనుభూతి కలిగించే చిత్రమిది. కథను వినూత్నంగా చూపించారు. ప్రేక్షకులు కథకు బాగా కనెక్ట్ అవుతారని చాలా నమ్ముతున్నా. చాలా మంది టైటిల్ నా పేరు లింక్ అయిందని ఊహించుకుంటారు. కానీ క్లైమాక్స్‌లో దాని వెనుకున్న అర్థం తెలుస్తుంది.
మీ పాత్ర గురించి..
1977 బ్యాక్ డ్రాప్ కృష్ణగిరి గ్రామంలో పోస్ట్‌మ్యాన్ అభినయ వాసుదేవ్‌గా నటించా. గ్రామం విషయానికొస్తే ఈ పాత్రకు నాకు అనుబంధంగా ఉంటుంది. మనం ఎప్పుడో కానీ ఇలాంటి పాత్రను చూడం. అందుకే ఆ కాలానికి సంబంధించిన మ్యానరిజం, స్పీచ్ లాంటి అంశాల మీద ఫోకస్ పెట్టా.
మీ గత సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి.. క గురించి ఏం చెప్తారు.?
నా గత రెండు సినిమాలతో అభిమానులు నిరాశ చెందారని తెలుసు. అందుకే క సినిమాను తాజా కథనంతో ఎంగేజింగ్‌గా ఉండేలా ఫోకస్ పెట్టాం. క ఒక విభిన్నమైన గ్రామీణ అనుభూతినిస్తుంది. క్లైమాక్స్‌లో ఆ సస్పెన్స్ ఏంటో తెలుస్తుంది. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారని నమ్ముతున్నాము.
హీరోయిన్ల గురించి..
తాన్వీ రామ్ రాధ పాత్రలో అద్భుతంగా నటించింది. నయన్ సారిక సత్యభామగా నా ప్రేయసి పాత్రలో నటించింది. కథలో ఇద్దరి పాత్రలు కీలకంగా ఉంటాయి.
మీ కొత్త ప్రాజెక్టుల సంగతేంటి..?
ఈ ఏడాది చాలా గుర్తుండిపోతుంది. పెండ్లి చేసుకున్నా.. ఇప్పుడు క విడుదలవుతుంది. దీని తర్వాత చిన్న విరామం తీసుకుందామనుకుంటున్నా. అనంతరం కొత్త ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తా.
Matka | వరుణ్ తేజ్ మట్కాలో పుష్ప యాక్టర్.. ట్రెండింగ్‌లో లుక్
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి