Matka | టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ (Varun Tej) కాంపౌండ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా చిత్రం మట్కా (Matka). పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాపులర్ పుష్పయాక్టర్ అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో చిల్లప్ప రెడ్డిగా కనిపించబోతున్నాడు.
గోల్డెన్ హార్ట్ అండ్ అచంచలమైన చిత్తశుద్ధితో కూడిన విధేయతతో కూడిన ఆత్మ.. అంటూ షేర్ చేసిన ఈ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అజయ్ ఘోష్ లుక్ షేర్ చేశారు మేకర్స్. ఇప్పుడీ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మట్కా చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ ఇప్పటికే రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లో.. సూట్ వేసుకున్న వరుణ్ తేజ్ సూపర్ స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ.. మెట్లు దిగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
మట్కాలో కథానుగుణంగా వైజాగ్ బ్యాక్ డ్రాప్లో ఉండే పూర్ణా మార్కెట్‌తోపాటు పలు ప్రాంతాలను రీక్రియేట్ చేశారని తెలిసిందే. పూర్ణా మార్కెట్.. మట్కా.. బిహైండ్ ది గేమ్.. యాక్ట్ 1, మట్కా.. బి హైండ్ ది గేమ్.. యాక్ట్ 2 అంటూ షేర్ చేసిన రెండు వీడియోలను షేర్ చేశారు. ఈ క్లబ్లో వరుణ్ తేజ్, నోరా ఫతేహి అండ్ టీంపై వచ్చే లే లే రాజా పాటను చిత్రీకరించినట్టు చెప్పారు మేకర్స్. ఈ సాంగ్ కలర్ఫుల్గా సాగుతూ సినిమాకు హైలెట్‌గా నిలువబోతుందని యాక్ట్ 2 హింట్ ఇచ్చేస్తుంది.
A Loyal Soul with Golden Heart & Unshakeable Integrity ❤️
Presenting #AjayGhosh as ‘Chilla Appa Reddy’ from #MATKA 🤩
IN THEATERS WORLDWIDE ON NOVEMBER 14, 2024 💥#MATKAonNOV14th
Mega Prince @IamVarunTej @KKfilmmaker @Meenakshiioffl #NoraFatehi @gvprakash @kishorkumardop… pic.twitter.com/fKFqvey41K— BA Raju’s Team (@baraju_SuperHit) October 28, 2024
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి