Pawan Kalyan | టాలీవుడ్ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను పాపులర్ తమిళ నటుడు, దర్శకనిర్మాత ఆర్ పార్థీబన్ కలిశాడు. మంగళగిరిలోని తన ఆఫీసుకు వచ్చిన పార్థీబన్‌కు శాలువా కప్పి సత్కరించారు పవన్ కల్యాణ్. ఈ విషయాన్ని పార్థీబన్ (R Parthiepan), పవన్ కల్యాణ్ ఎక్స్ ద్వారా షేర్ చేసుకున్నారు.
ప్రతీ సాయంత్రం మేము గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాం. కానీ నిన్న మాత్రం చాలా చాలా శుభ సాయంత్రం. మా కలయిక అందమైన, సత్యమైన క్షణాలను బదలాయించుకునేలా సాగింది. మీరందించిన కానుకలు, ప్రత్యేకించి మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత, ఆతిథ్యం మాటల్లో చెప్పలేనిది. నిజానికి నేనొక రియల్ హీరోను కలిశా..అంటూ పవన్ కల్యాణ్తోదిగిన సెల్ఫీని షేర్ చేశాడు పార్థీబన్.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పార్థీబవన్కు వినాయకుడి ప్రతిమ అందించగా.. పార్థీబన్ తాను రాసిన పుస్తకాన్ని పవన్ కల్యాణ్‌కు అందించాడు . మరోవైపు ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను పవన్ కల్యాణ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నా మంగళగిరి కార్యాలయంలో నటుడు, దర్శకుడు పార్థీబన్తో సంభాషించడం సంతోషంగా ఉంది. జీవితం, సినిమా, వ్యక్తిగత అనుభవాలకు సంబంధించిన ఇన్పుట్స్ నిజంగా స్ఫూర్తిదాయకం. ఆర్ పార్థీబన్ యాక్టర్, ఫిల్మ్ మేకర్ మాత్రమే కాదు.. కవి, ఆలోచనాపరుడు, స్టోరీ టెల్లర్, మోటివేషనల్ స్పీకర్, మూడు సార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి.. అని ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.
It was a pleasure meeting and having a warm conversation with the remarkable actor and filmmaker, Thiru @rparthiepan avl, at my camp office in Mangalagiri. His insights into cinema, life, and personal experiences are truly inspiring. Thank you, Thiru @rparthiepan avl, for the… pic.twitter.com/ZiKmrwSfRp
— Pawan Kalyan (@PawanKalyan) October 28, 2024
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?