Venky Atluri | టాలీవుడ్లో ఉన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు వెంకీ అట్లూరి (Venky Atluri). సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకున్న వెంకీ అట్లూరి చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ధనుష్‌తో తెరకెక్కించిన సార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమా గురించి వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. చాలా మంది టాప్ హీరోలు సినిమా చేసేందుకు నో చెప్పారు. దీనికి కారణం సినిమా క్లైమాక్స్. కొందరు పాపులర్ యాక్టర్లు క్లైమాక్స్‌లో మార్పులు చేయాలని కోరారు. అయితే ఈ విషయంలో తాను రాజీపడకపోవడంతో వాళ్లు సినిమాకు సంతకం చేయొద్దనుకున్నారన్నాడు.
ఇక వేరే మార్గం లేక పోవడంతో ధనుష్ దగ్గరకు వెళ్లి సినిమా కథ చెప్పాను. ఆయన కథ విని, క్లాప్ కొట్టాడు. క్లైమాక్స్‌ని లైక్ చేశాడు. సినిమా యూనిక్ ఎండింగ్‌ను అతను ఓకే చేయడంతో నేను కూడా షాక్ అయ్యా. అలాసార్ టీంలోకి ధనుష్ వచ్చాడంటూ చెప్పుకొచ్చాడు వెంకీ అట్లూరి. మొత్తానికి అలా సార్ సినిమా ధనుష్ చేతుల్లోకి వెళ్లడం.. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడం జరిగిపోయాయన్నమాట.
Actress Sai Pallavi | నేను ఆ తప్పు చేయలేదు.. ఏడుస్తూ చెప్పిన నటి సాయిపల్లవి
Idly Kadai | ఇడ్లీకడైలో ధనుష్ లుక్ ఎలా ఉండబోతుందో తెలుసా..?