Tharun Bhascker | యాక్టర్‌గా, డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న అతికొద్ది మంది సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటాడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). పెళ్లి చూపులు సినిమాతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం జయ జయ జయ జయహే సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడని తెలిసిందే.
కాగా రీసెంట్గా తన బర్త్ డే పార్టీకి వచ్చిన యూట్యూబర్ ఆగమ్ బాకు తరుణ్ భాస్కర్ సర్ప్రైజ్ ఇచ్చాడు. గతేడాది యూట్యూబర్ ఆగమ్ బా గోల్డ్ ప్లే బటన్‌ను అందుకున్నాడు. అయితే గోల్డ్ ప్లే బటన్‌ను తరుణ్ భాస్కర్‌తో ఓపెన్ చేయించాలనుకున్నాడు. ఆగమ్ బా చాలా కాలానికి తరుణ్ భాస్కర్ స్నేహితుడి సాయంతో అతని బర్త్ డే పార్టీకి వెళ్లాడు.
ఈ విషయం తెలుసుకున్న తరుణ్ భాస్కర్ సర్ప్రైజ్ ఇస్తూ.. స్వయంగా ఆగమ్ బాను స్టేజ్‌పైకి పిలిచి గోల్డ్ ప్లే బటన్‌ను అన్‌బాక్స్ చేసి.. అతని పట్టుదలపై ప్రశంసలు కురిపించాడు. దీంతో ఆ అభిమాని (ఆగమ్ బా) ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేసిన పోలీసులు