మలయాళంలో పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చి..సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం లూసిఫర్. ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో కలిసి తీస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ అప్ డేట్ రానే వచ్చింది. లూసిఫర్ రీమేక్ (Lucifer Remake) మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (Thaman) చాలా ఎక్జయిటింగ్ కు లోనవుతూ..రెండు అప్ డేట్స్ ను చిరు అభిమానులకు అందించాడు.
జీవితమంతా గుర్తు పెట్టుకునే రోజు. చిరంజీవి 153 కోసం ఓ పాటను పూర్తి చేశాం. చిరంజీవి నుంచి ప్రశంసలు, శుభాకాంక్షలు అందుకున్నాం. ఇది నాకు చాలా చాలా స్పెషల్..బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్. మోహన్ రాజాకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు థమన్. చిరంజీవి, మోహన్ రాజాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు లూసిఫర్ రీమేక్ షూటింగ్ రేపటి నుంచి మొదలవుతుందని చెప్పాడు థమన్.
సాంగ్ పూర్తి చేయడం, రేపటి నుంచి చిత్రీకరణ మొదలు కానున్నట్టు తెలియగానే సంతోషంలో మునిగి తేలుతున్నారు అభిమానులు. రాంచరణ్, సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోండగా..మేకర్స్ త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై క్టారిటీ ఇవ్వనున్నారని టాక్.
A day to Remember for life ❤️ We Completed Our Song for #Chiru153 that warm wishes from our dear #MEGASTAR @KChiruTweets gaaru himself 🎵♥️ Was Something Very Very Special to me As a biggest FAN boy 😍 thanks to @jayam_mohanraja
— thaman S (@MusicThaman) August 12, 2021
Shoot starts TOM 🎬 📢 @KonidelaPro
Godbless 😊 pic.twitter.com/DRVdp93f7V
ఇవి కూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్