TG Vishwa Prasad | హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) టైటిల్ రోలో నటించిన చిత్రం మిస్టర్ బచ్చన్ (Mr Bachchan), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కించారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. టీజీ విశ్వప్రసాద్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో నిర్మాతకు హరీష్ శంకర్‌కు మధ్య ఉన్న అనుబంధం గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా వీటిపై ఎక్స్‌లో చేసిన చిట్‌చాట్‌లో క్లారిటీ ఇచ్చాడు.
ఫస్ట్ హరీష్ శంకర్ నాకు స్నేహితుడు. నేను హరీష్ శంకర్‌పై ఎప్పుడు కామెంట్ చేయను. అతనితో మళ్లీ సినిమా చేయడం సంతోషంగా ఉంది. తన రెమ్యునరేషన్ నుండి పంపిణీదారులకు ఏదైనా నష్టాన్ని భర్తీ చేసేందుకు వెంటనే స్పందించిన చాలా మంచి వ్యక్తి హరీష్ శంకర్. కొన్ని పాఠాలు ఉండవచ్చు, అయితే నేను రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని పాఠాలను షేర్ చేసుకున్నాను. విజయానికున్న చాలా సానుకూల అంశాలను స్పష్టంగా చెప్పాను. పరిమిత విజయం ఉంటే చాలా ఫీడ్‌బ్యాక్ ఉంటుంది. మనమంతా స్వీకరించాలి. మా పాఠాలన్నింటిని ఉపయోగించుకొని.. మరో భారీ సినిమాతో తిరిగి వస్తామని పుకార్లకు చెక్ పెట్టారు టీజీ విశ్వ ప్రసాద్.
మిస్టర్ బచ్చన్‌లో భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్లో నటించగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కించారు.
Toofan | ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ తుఫాన్.. ఏ ప్లాట్ఫాంలోనంటే..?
Raayan | రాయన్ సక్సెస్ ట్రీట్.. ధనుష్‌కు ఒకేసారి రెండు చెక్కులు