‘1969 నుంచి నేటి వరకు తెలంగాణ చరిత్రను కళ్లముందు ఆవిష్కరించే చిత్రమిది. వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కించాం’ అని అన్నారు హరీష్ వడత్యా. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ హీరోలుగా నటించారు. మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. ఈ నెల 12న ఈ చిత్రం విడుదలకానుంది.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జిషాన్ ఉస్మాన్ మాట్లాడుతూ ‘ట్వెల్త్ గ్రేడ్ చదువుతున్న సమయంలో దర్శకుడు హరీష్ వడత్యా ఆఫీస్‌కు వెళ్లాను. నటన పట్ల నాకున్న ఇష్టాన్ని గమనించిన ఆయన నాతో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు. విజయ్‌దేవ్ అనే గొప్ప ఉద్యమకారుడి కథను వినిపించారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి కోట్లాది మంది కలను నెరవేచ్చిన ఆ మహా నాయకుడి చిన్ననాటి పాత్రలో నేను కనిపిస్తా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగించిన పోరాటం, చేసిన త్యాగాల్ని గురించి తెలుసుకున్నా. వాటిపై పరిశోధన చేసి నా పాత్రకు న్యాయం చేశా’ అని అన్నారు. దర్శకుడు హరీష్ వడత్యా మాట్లాడుతూ ‘బాల్యం నుంచే పోరాటపఠిమ ఉన్న నాయకుడు తనకు ఎదురైన సమస్యల్ని ఎలా అధిగమించాడు?తన కలల్ని ఎలా సాకారం చేసుకున్నాడనే అంశాల్ని అర్థవంతంగా సినిమాలో చూపించాం. డాక్యుమెంటరీలా కాకుండా కమర్షియల్ హంగులతో తెరకెక్కించాం. ఉద్యమనాయకుడి పాత్రలో శ్రీకాంత్ అద్వితీయమైన నటనను కనబరిచాడు. రాష్ట్ర విభజన సమయంలో కొంతమంది స్వార్థం వల్ల తెలంగాణ, ఆంధ్ర మధ్య విభేదాలు తలెత్తాయి. రెండు రాష్ర్టాల మధ్య ఉన్న సంబంధాల్ని స్నేహపూర్వకంగా ఈ సినిమాలో చూపించాం. ఎవరిని కించపరచలేదు. సెన్సార్ పరంగా అభ్యంతరాలు ఉండకూడదనే నిజమైన నాయకుల పేర్లను ఉపయోగించలేదు. బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, సంగీత, వెంకట్‌తో పాటు యాభైకి మందికిపైగా అనుభవజ్ఞులైన నటీనటులు ఈ సినిమాలో కనిపిస్తారు’ అని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa Promotional Event | పుష్ప స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
NBK107 Launch Date | బాలకృష్ణ-గోపీచంద్ ఎంటర్టైనర్ లాంఛింగ్ టైం ఫిక్స్
mega154 | చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో?
బాబోయ్ ఇది ఊర నాటు.. మాస్ డాన్సులతో కుమ్మేసిన చరణ్, ఎన్టీఆర్..
Brahmanandam Rejection | బ్రహ్మానందంను సినిమా నుంచి తొలగించిన నితిన్..?