Raviteja in mega154 | మెగాస్టార్ చిరంజీవి ( mega star chiranjeevi ) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. లూసిఫర్ మలయాళ రీమేక్ గాఢ్ ఫాదర్ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేశాడు. ఇక భోళా శంకర్ సినిమా గురువారం మొదలవుతోంది. ఇదిలా ఉంటే చిరంజీవి 154వ సినిమా కూడా అనౌన్స్ చేశాడు. జై లవకుశ ఫేం బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి చిరు లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఆ పోస్టర్లో గ్యాంగ్ లీడర్ సినిమా స్టైల్ మాస్ లుక్‌లో ఉన్న మెగాస్టార్‌ను చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఉందని.. అందులో స్టార్ హీరో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న మెగాస్టార్ 154వ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దీనికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. డిసెంబర్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెల్లే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఉందని.. ఆ పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నయ్య సినిమా కావడంతో రవితేజ కూడా మరో మాట లేకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి రవితేజ పెద్ద ఫ్యాన్ అని అందరికీ తెలిసిన విషయమే. అందుకే చిరుతో నటించే అవకాశం ఎప్పుడు వచ్చినా రవితేజ వదులుకోలేదు. తొలిసారిగా ఆజ్కా గుండా రాజ్ సినిమాలో చిరంజీవితో నటించాడు రవితేజ. ఆ సినిమాలో మెగాస్టార్ స్నేహితుల్లో ఒకడిగా కనిపించాడు. ఆ తర్వాత అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా నటించాడు. అప్పటి నుంచి చిరంజీవిని రవితేజ ముద్దుగా అన్నయ్య అనే పిలుస్తుంటాడు.
కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన రోజుల్లోనే కాదు.. హీరోగా మారిన తర్వాత కూడా మెగాస్టార్ సినిమాలో నటించాడు రవితేజ. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఒక పాటలో అలా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఇప్పటికే మూడుసార్లు అన్నయ్యతో స్క్రీన్ షేర్ చేసుకున్న రవితేజ.. ఇప్పుడు నాలుగోసారి చిరంజీవి సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్‌ను ఈ సినిమాలో కీ రోల్లో నటింపజేయాలని డైరెక్టర్ బాబీ అనుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. మరి రవితేజ, పవన్‌కళ్యాణ్‌లో ఎవరు చిరంజీవితో కలిసి నటిస్తారో చూడాలి మరి!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tamannah: తమన్నా ఖాతాలో సరికొత్త రికార్డ్.. తగ్గేదే లే అంటున్న మిల్కీ బ్యూటీ..!
పూరీ, చిరంజీవి కాంబినేషన్ రెడీ.. ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి..?
మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా ఫిక్స్.. నిర్మాత ఎవరో తెలుసా..?
Big News : చిరంజీవి పవన్ మల్టీ స్టారర్ రాబోతుంది..!
చిరంజీవి, రజినీకాంత్ సినిమాల మధ్య ఈ పోలికలు గమనించారా..?
Chiranjeevi: అల్లు అర్జున్‌తో మల్టీ స్టారర్ చేయనున్న చిరు.. దర్శకుడు ఎవరో తెలుసా?
Britney Spears: చిరంజీవి సినిమా కోసం బ్రిట్నీ స్పియర్‌ని రంగంలోకి దించుతున్నారా..!
Gangavva: చిరంజీవికి తల్లిగా గంగవ్వ.. ఏ చిత్రంలోనో తెలుసా?