Peddanna and bhola shankar | సాధారణంగా 60 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో అలా కాదు. కొంతమంది హీరోలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కుర్ర హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు. అందులో రజనీకాంత్, చిరంజీవి అందరికంటే ముందుంటారు. ఈ ఇద్దరూ ఇప్పటికీ దూకుడు చూపిస్తున్నారు. వాళ్ల జోరు చూసి యంగ్ హీరోలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 5 సినిమాలు చేస్తున్నాడు. అటు వైపు రజనీకాంత్ కూడా తక్కువ తినడం లేదు. ఆయన కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే యాదృచ్చికంగా ఇప్పుడు ఈ ఇద్దరు చేస్తున్న పెద్దన్న, భోళాశంకర్ సినిమాల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి.
రజినీకాంత్ నటించిన అన్నాతే సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతోంది. అదే రోజున తెలుగులో పెద్దన్న గా ఈ సినిమా విడుదలవుతుంది. గతంలో అజిత్ హీరోగా వీరం, విశ్వాసం, వేదాళం లాంటి సినిమాలు తెరకెక్కించిన శివ ఈ సినిమాకు దర్శకుడు. విలేజ్ డ్రామాను తెరకెక్కించడంలో శివ ఆరితేరిపోయాడు. ఇప్పుడు రజనీకాంత్ తో కూడా అలాంటి సినిమానే చేస్తున్నాడు. ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కీలకం. పెద్దన్న సినిమాలో కీర్తి సురేశ్ రజినీకాంత్ చెల్లెలిగా నటిస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో కూడా చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తుంది.
ఇక్కడే మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఇది తమిళ సినిమా వేదాళం రీమేక్. అక్కడ ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శివ. ఇప్పుడు పెద్దన్న సినిమాకు కూడా ఆయనే దర్శకుడు. ఈ రెండు సినిమాలలో యాదృచ్చికంగా కీర్తి సురేశ్ చెల్లెలి పాత్రలో నటిస్తోంది. పైగా చిరంజీవి, రజినీకాంత్ సినిమాలు రెండూ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కుతున్నాయి. ఇలా ఈ రెండు సినిమాల మధ్య కొన్ని పోలికలు ఆసక్తికరంగా ఉన్నాయి. నవంబర్ 11న భోళా శంకర్ సినిమా ముహూర్తం జరగనుంది. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SPB last song | రజినీకాంత్ కోసం ఎస్పీ బాలు పాడిన చివరి పాట వచ్చేసిందిగా..
bhola shankar | చిరంజీవి సినిమాకు నో చెప్పడానికి కారణం అదే.. సాయిపల్లవి క్లారిటీ..
Keerthy Suresh: కీర్తి సురేష్ చెల్లెలిగా ఫిక్స్ అయిపోతుందా ఏంటి? అభిమానుల్లో టెన్షన్
యాంకర్‌గా మారనున్న మహానటి కీర్తి సురేశ్.. రెమ్యునరేషన్ కూడా భారీగానే..
keerthy suresh | కీర్తిసురేశ్‌కు వాళ్ల అమ్మ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా..?
Keerthy Suresh | కమెడియన్ తో కీర్తిసురేశ్ సినిమా..రిస్క్ చేస్తుందా..?