Keerthy Suresh | కమెడియన్ తో కీర్తిసురేశ్ సినిమా..రిస్క్ చేస్తుందా..?
ప్రముఖ తమిళ సినీ నటుడు, కమెడియన్ వడివేలు (Vadivelu) చాలా కాలం తర్వాత నాయ్ శేఖర్ రిటర్న్స్ (Naai Sekhar Returns) సినిమాతో అభిమానులకు వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతున్నాడు.

2017లో వచ్చిన మెర్సల్ సినిమా తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరమయ్యాడు ప్రముఖ తమిళ సినీ నటుడు, కమెడియన్ వడివేలు (Vadivelu). చాలా కాలం తర్వాత నాయ్ శేఖర్ రిటర్న్స్ (Naai Sekhar Returns) సినిమాతో అభిమానులకు వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతున్నాడు. సూరజ్ (Suraj) దర్శకత్వం వస్తున్నాడు. థలై నగరం చిత్రంలో వడివేలు పోషించిన ఐకానిక్ క్యారెక్టర్ నాయ్ శేఖర్ ఆధారంగా తెరకెక్కనుందీ సినిమా.
ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త చెన్నై సర్కిల్ లో రౌండప్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ ఈ చిత్రంలో నటించనుందట. అయితే వడివేలు కు జోడీగా కాకుండా..కీలక పాత్రలో కనిపించనుందని టాక్. తాజా సమాచారం ప్రకారం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని..దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా హీరోయిన్లు కెరీర్ తొలినాళ్లలో కమెడియన్లతో కలిసి నటించే రిస్క్ తీసుకోరు.

మరి మహానటి చిత్రంతో స్టార్ హోదా దక్కించుకున్న కీర్తిసురేశ్ ఆ రిస్క్ తీసుకుంటుందా..? లేదా..? అనేది చూడాలి. కీర్తిసురేశ్ ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాటలో ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించనుంది. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న అన్నాత్తెలో కూడా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

