Tamannah: తమన్నా ఖాతాలో సరికొత్త రికార్డ్.. తగ్గేదే లే అంటున్న మిల్కీ బ్యూటీ..!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ మిల్కీ బ్యూటీ తమన్నా చక్కగా పాటిస్తుంది. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఈ ముద్దుగుమ్మ వదులుకోవడం లేదు.ఒకవైపు టీవీ షోస్, మరోవైపు వెబ్ సిరీస్, ఇంకో వైపు సినిమలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఐటెం సాంగ్ ఆఫర్స్ వచ్చినా కూడా తమన్నా వదలట్లేదు.తాజాగా ఈ ముద్దుగుమ్మ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని అందుకుంది.
ఈ ఆఫర్ తర్వాత తమన్నా మెగా ఫ్యామిలీ టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ గా ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పటికే తమన్నా .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గంగతో రాంబాబు సినిమా చేసి తనలోని డిఫరెంట్ యాంగిల్ ని చూపించింది.. ఇక రామ్ చరణ్‌తో కలిసి రచ్చ సినిమాలో తెగ రచ్చ చేసింది. ఇందులో ఇద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా వాన వాన రీమేక్ సాంగ్ లో రామ్ చరణ్, తమన్నాలు చాలా ఈజ్‌తో డ్యాన్స్‌చేసి అదరగొట్టారు.
మెగా ఫ్యామిలీకి సంబంధించిన మరో హీరో బన్నీతో కూడా తమన్నా స్క్రీన్ షేర్ చేసుకుంది. వినాయక్ డైరెక్షన్లో వచ్చిన బద్రీనాధ్ మూవీలో అల్లు అర్జున్ కి జంటగా నటించి మెప్పించింది ఈ మిల్కీ బ్యూటీ. ఇక వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 చిత్రంలోను తమన్నా నటించింది కాని, అందులో వెంకీ సరసన కథానాయికగా నటించింది. మొత్తానికి మెగా హీరోలందరిని చుట్టేస్తున్న ఈ ముద్దుగుమ్మ క్రేజీ రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Chiranjeevi
- tamannah
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

