మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా ఫిక్స్.. నిర్మాత ఎవరో తెలుసా..?

chiranjeevi and trivikram | చిరంజీవితో సినిమా చేయాలని ఏ దర్శకుడికి మాత్రం ఉండదు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ దర్శకులంతా మెగాస్టార్‌తో వరస సినిమాలు చేస్తున్నారు. ఒకటి రెండు కాదు అరడజన్ సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్. ఏది ఎప్పుడు తెరకెక్కుతుందో కూడా అర్థం కావడం లేదు. కొరటాల శివతో చేస్తున్న ఆచార్య షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా 2022 ఫిబ్రవరి 4న విడుదల కానుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని తన కొణిదెల బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కొరటాల సినిమా తర్వాత మరో మూడు సినిమాలు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశాడు మెగాస్టార్. అందులో లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమాకు జయం రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు వేదాళం రీమేక్ భోళా శంకర్ కూడా ముహూర్తం జరుపుకుంది. ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా 2022లో పూర్తి కానున్నాయి. బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను నవంబర్ 6న అంగరంగ వైభవంగా మొదలు పెట్టాడు చిరంజీవి. ఇందులో పక్కా మాస్ కారెక్టర్ చేస్తున్నాడు మెగాస్టార్. ఈ నాలుగు సినిమాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చిరు సినిమా ఉండబోతుంది.

అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న త్రివిక్రమ్ త్వరలోనే మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నాడు త్రివిక్రమ్. తాను ఒప్పుకున్న కమిట్మెంట్స్ అయిన తర్వాత చిరంజీవి సినిమా ఉంటుందని తెలుస్తుంది. అప్పట్లో చిరంజీవి కూడా తాను త్రివిక్రమ్ సినిమా చేస్తానని మాటిచ్చాడు. మెగాస్టార్ కోసం త్రివిక్రమ్ కూడా ఓ లైన్ అనుకుని సిద్ధంగానే ఉన్నాడు. పవన్, మహేశ్ బాబు సినిమాల తర్వాత చిరు సినిమాపై దృష్టి పెట్టనున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గతంలో మెగాస్టార్ నటించిన జై చిరంజీవ సినిమాకు కథ, మాటలు అందించాడు మాటల మాంత్రికుడు. ఇక ఇప్పుడు తెరకెక్కించబోయే సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. చిరు కామెడీ టైమింగ్ పూర్తిగా వాడుకునే సినిమా ఇది అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను ట్రిపుల్ ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించబోతున్నాడు. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ నాలుగోసారి రిపీట్
Pawan kalyan | భీమ్లా నాయక్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?
Big News : చిరంజీవి పవన్ మల్టీ స్టారర్ రాబోతుంది..!
Sai Dharam Tej: మెగా ఫ్యామిలీతో సాయి ధరమ్ తేజ్.. ప్రమాదం తర్వాత తొలి ఫొటో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

