Pushpa Promotional Event | పుష్ప స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో పుష్ప (Pushpa) ఒకటి. ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన పనులు త్వరలోనే షురూ చేసేందుకు రెడీ అవుతున్నారు సుకుమార్ అండ్ టీం.

సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో పుష్ప (Pushpa) ఒకటి. టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమాను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు బన్నీ. ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన పనులు కూడా త్వరలోనే షురూ చేసేందుకు రెడీ అవుతున్నారు సుకుమార్ అండ్ టీం.
తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 3న దుబాయ్‌లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. పుష్ప పాన్ ఇండియా కథాంశం కావడంతో అదే స్థాయిలో ప్రమోట్ చేసేందుకు రెడీ అయ్యారు. పుష్పలో సునీల్ (Sunil) మంగళం శ్రీను (Mangalam Srinu) పాత్రలో కనిపించనుండగా..అందాల యాకంర్ అనసూయ దాక్షాయణిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ ఇద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేస్తున్నాయి.
మొదటి పార్టులో సునీల్ పాత్ర అల్లు అర్జున్ పోషించే పుష్పరాజ్‌ను సవాలు చేస్తూ ఉంటుందని తెలుస్తోండగా..రెండో పార్టులో మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ సునీల్ ప్లేస్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
- sukumar
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

