actor sri ram | డ్రగ్స్ కేసు (Drugs Case)లో తమిళ నటుడు శ్రీరామ్ (actor sri ram) అరెస్టైన విషయం తెలిసిందే. చెన్నై (Chennai) పోలీసులు నటుడిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తొమ్మిది గంటలపాటూ విచారించారు. అతడి రక్త నమూనాలను వైద్య పరీక్షల కోసం పంపారు. అనంతరం శ్రీరామ్‌ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ (judicial custody) విధించారు. జులై 7 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. అనంతరం పోలీసులు అతడిని కస్టడీకి తరలించారు.
మాజీ ఏఐడీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో శ్రీరామ్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నుంగంబాక్కం పోలీస్‌స్టేషన్‌కి తరలించి దాదాపు తొమ్మిది గంటల పాటూ అనేక కోణాల్లో విచారించారు. విచారణ అనంతరం శ్రీరామ్ మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి ఉపయోగించాడని, సరఫరాదారులతో సంబంధాలు కొనసాగించాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో నటుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్ కాగా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి. సినిమాలపై ఇష్టంతో చెన్నైకి వెళ్లాడు. తన పేరును శ్రీరామ్‌గా మార్చుకున్నాడు. తమిళ చిత్రం రోజా కూటంతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా, ఈ చిత్రం తెలుగులో రోజా పూలు పేరుతో విడుదలైంది. ‘ఒకరికి ఒకరు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యారు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఒకరికి ఒకరు తదితర చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. ఈ మధ్య ‘హరికథ’ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు శ్రీరామ్ అరెస్ట్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read..
Jaideep Ahlawat | షారుఖ్ ఖాన్ సినిమాలో ‘పాతాళ్ లోక్’ నటుడు
Hari Hara Veera Mallu | దుల్కర్ సల్మాన్ చేతికి ‘హరి హర వీర మల్లు’
Panchayat Season 4 | ఓటీటీలోకి వచ్చేసిన ‘పంచాయత్ సీజన్ 4’