Shah Rukh Khan | ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్‌తో ఓవర్‌నైట్ స్టార్ మారిన బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లవత్. ఈ వెబ్ సిరీస్‌లో ఒక మధ్య తరగతి తండ్రిగా.. పోలీస్ స్టేషన్లో ఎవరు గుర్తించని ఇన్స్పెక్టర్గా జీవించేశాడు జైదీప్ అహ్లవత్. ఇప్పటికే రెండు సీజన్లు రాగా.. రెండు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. అయితే పాతాళ్లోక్తో పాపులర్ అయిన ఈ నటుడు మరో బంపరాఫర్‌ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలో జైదీప్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని జైదీప్ స్వయంగా వెల్లడించాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జైదీప్ మాట్లాడుతూ, షారుఖ్ ఖాన్‌తో కలిసి పనిచేయడానికి ఎవరు మాత్రం నో చెబుతారని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మొదట్లో తనను ఈ పాత్రకు తీసుకోవడానికి కాస్త ఆలోచించినప్పటికి, షారుఖ్ ఖాన్ స్వయంగా తనను కింగ్ చిత్రంలో భాగం కావాలని కోరారని జైదీప్ వెల్లడించారు. ఖాన్ సాబ్ ఖాన్ సాబే, ఎవరు మాత్రం ఆయన మాట కాదంటారు? అని ఆయన పేర్కొన్నారు.
కింగ్ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి మరిన్ని వివరాల కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.