Panchayat 4 | ఓటీటీ ప్రేక్షకులకు ఈ వీకెండ్ ముందుగానే వచ్చింది. ఒకవైపు థియేటర్లలో కుబేరతో పాటు ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ సందడి చేస్తుంటే మరోవైపు ప్రేక్షకులను అలరించడానికి క్రేజీ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన పాపులర్ వెబ్ సిరీస్ పంచాయత్ నాలుగో సీజన్ వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సీజన్ కథ విషయానికి వస్తే.. ఈసారి ఫులేరా గ్రామంలో ఎన్నికల కోలాహలం మొదలైనట్లు తెలుస్తుంది. ప్రధాన్ జీ (రఘుబీర్ యాదవ్), భూషణ్ (దుర్గేష్ కుమార్) మధ్య తీవ్రమైన పోటీ జరగబోతున్నట్లు స్పష్టమవుతోంది. గత సీజన్లలో అలరించిన జితేంద్ర కుమార్ (అభిషేక్), నీనా గుప్తా (మంజు దేవి), ఫైసల్ మాలిక్, చందన్ రాయ్ ఈ సీజన్లోనూ తమ పాత్రలను కొనసాగిస్తున్నారు.
Hum first ☝️#PanchayatOnPrime, Watch Now pic.twitter.com/vs3ZD8qlxN
— prime video IN (@PrimeVideoIN) June 24, 2025
Read More