Iran | కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.. ఇరాన్ కీలక ప్రకటన
Iran | ఇరాన్ (Iran) కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం (ceasefire) అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.
Iran | ఇరాన్ (Iran) కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం (ceasefire) అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చే ముందు ఇజ్రాయెల్‌పై చివరి క్షిపణి ప్రయోగించినట్లు వెల్లడించింది. ఇరాన్ ప్రకటనతో ఇజ్రాయెల్‌తో 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది.
మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. యుద్ధం ముగిసిందంటూ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. 12 రోజుల యుద్ధానికి ముగింపు అని పేర్కొన్నారు. ‘అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్, ఇరాన్‌లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభిస్తుంది. ఇజ్రాయెల్ దానిని అనుసరిస్తుంది. దీంతో 12 రోజుల యుద్ధం ముగియనుంది. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాలి. అన్నీ సరిగానే జరుగుతాయని భావిస్తున్నా. ఈ యద్ధం ఏండ్ల తరబడి కొనసాగితే పశ్చిమాసియా నాశనమయ్యేది. కానీ అలా జరగలేదు. ఇక ముందూ అలా జరగదు. ఇజ్రాయెల్, ఇరాన్‌తో సహా మధ్యప్రాచ్యం, ప్రపంచ దేశాలతోపాటు అమెరికాకు దేవుడి దయ ఉంటుంది’ అని ట్రంప్ అన్నారు.
అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటనను ముందు టెహ్రాన్ ఖండించిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణపై గానీ, సైనిక కార్యకలాపాలను ఆపేందుకుగానీ ఇప్పటివరకు తమ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి వెల్లడించారు. అయితే యుద్ధం కొనసాగించాలన్న ఆలోచన తమకు లేదని తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. వాళ్లు దాడులు ఆపితే తాము ఆపేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరుగలేదు. సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తీసకుంటామని చెప్పారు. అయితే, తాజాగా కాల్పుల విమరణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది.
కాల్పుల విరమణకు ముందు.. టెల్ అవీవ్‌పై క్షిపణుల దాడి
ఈ ప్రకటనకు ముందు ఇవాళ తెల్లవారుజామున 4 గటంల తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్ కూడా ధ్రువీకరించింది. టెహ్రాన్ క్షిపణి దాడులతో దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ అంతటా సైరన్ల మోత మోగింది. ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రజల సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఐడీఎఫ్ సూచించింది. మరోవైపు తాజా దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వారిలో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Qatar | అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడులు.. ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక అడ్వైజరీ
Israel-Iran | ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించిన ఇరాన్.. పలువురు మృతి
Israel Iran War | ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందన్న ట్రంప్.. ఖండించిన టెహ్రాన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

