Israel-Iran | ఇరాన్-ఇజ్రాయెల్ (Israel-Iran) మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన్పటికీ.. దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇజ్రాయెల్‌పై టెహ్రాన్ (Tehran) క్షిపణులతో విరుచుకుపడింది (missile attacks).
మంగళవారం తెల్లవారుజామున 4 గంటల తర్వాత టెల్ అవీవ్‌పై టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్ కూడా ధ్రువీకరించింది. టెహ్రాన్ క్షిపణి దాడులతో దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ అంతటా సైరన్ల మోత మోగింది. ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రజల సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఐడీఎఫ్ సూచించింది. మరోవైపు తాజా దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వారిలో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది.. ట్రంప్
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం (Israel Iran War) ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందానికి వచ్చాయని చెప్పారు. ఈ ఒప్పందం మరో 24 గంటల్లో అమల్లోకి వస్తుందని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో పోస్టు చేశారు. 12 రోజుల యుద్ధానికి ఇది ముగింపని, యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ పేర్కొన్నారు. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయని, 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందంటూ ప్రకటించారు.
ట్రంప్ ప్రకటనను ఖండించిన ఇరాన్..
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణపై గానీ, సైనిక కార్యకలాపాలను ఆపేందుకుగానీ ఇప్పటివరకు తమ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి వెల్లడించారు. అయితే యుద్ధం కొనసాగించాలన్న ఆలోచన తమకు లేదని తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. వాళ్లు దాడులు ఆపితే తాము ఆపేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరుగలేదు. సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తీసకుంటామని చెప్పారు.
Also Read..
Iran | ఇజ్రాయెల్ ఆపితే మేమూ ఆపుతాం.. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించిన ఇరాన్
Israel Iran War | ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిందన్న ట్రంప్.. ఖండించిన టెహ్రాన్
ఫోర్డో కోసం చివరి వరకూ!.. అణు కేంద్రాన్ని పటిష్టం చేసేందుకు తీవ్రంగా శ్రమించిన ఇరాన్!