Tamannah | సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వెడ్డింగ్ వార్తలు కొత్తేమి కాదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు వివిధ సినీ పరిశ్రమలలో తరచూ ఎవరో ఒక హీరోహీరోయిన్‌కు సంబంధించి వెడ్డింగ్ బెల్స్ వార్తలు హల్ చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah)కు సంబంధించిన వెడ్డింగ్ న్యూస్ ఒకటి హాట్ టాపిక్‌గా మారింది. ఈ భామ కోస్టార్ విజయ్ వర్మ (Vijay Varma)తో రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే.
ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని కెమెరాల ముందు ప్రత్యక్షమవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటారు. తాజాగా ఈ ఇద్దరు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నారన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తమన్నా-విజయ్ 2025లో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారని.. ఈ నేపథ్యంలో వెడ్డింగ్ తర్వాత ఉండేందుకు ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనే పనిలో ఉన్నారని బీటౌన్ సర్కిల్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలపై తమన్నా నుంచి కానీ, విజయ్ వర్మ నుంచి కానీ ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
తమన్నా ప్రస్తుతం తెలుగులో ఓదెల 2 చిత్రంలో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. మరోవైపు హిందీలో Sikandar Ka Muqaddar నటిస్తోంది. విజయ్ వర్మ సూర్య 43లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Sarangapani Jathakam teaser | మీరు ఊహించని అద్భుతం జరుగుతోంది.. ప్రియదర్శి సారంగపాణి జాతకం టీజర్
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు