Suriya 45 | కోలీవుడ్ హీరో సూర్య (Suriya) శివ దర్శకత్వంలో నటించిన కంగువ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాగా సూర్య ఇక నెక్ట్స్ చేయబోయే సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం లో సూర్య 44 (Suriya 44), సుధా కొంగర డైరెక్షన్లో సూర్య 43కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. వీటితోపాటు ఆర్జే బాలాజీ డైరెక్షన్లో సూర్య 45 కూడా చేస్తున్నాడు.
కొన్ని రోజుల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. నవంబర్లోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది. తాజాగా క్రేజీ న్యూస్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా చెన్నై సుందరి త్రిష మరోసారి మెరువబోతుందని, దీనిపై అధికారిక రావడమే ఆలస్యమని ఇన్సైడ్ టాక్.
ఇదే నిజమైతే సూర్య-త్రిష కాంబోలో రాబోయే మూడో సినిమా కానుంది. ఆర్జే బాలాజీ డైరెక్షన్లో MaasaaniAmman చేయాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ సినిమా స్థానంలో సూర్య 45 చేరిపోయింది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
#Suriya45 – Trisha to do the female lead in the movie, Directed by RJBalaji♥️🔥#Suriya & #Trisha to reunite after Mounam Pesiyathe & Aaru 🫶
[PS – RJBalaji was supposed to do MaasaaniAmman with Trisha which is converted as Suriya45 now] pic.twitter.com/pbtFNi4VF8
— AmuthaBharathi (@CinemaWithAB) November 20, 2024
Mammootty | మాలీవుడ్ మల్టీస్టారర్ కోసం శ్రీలంకలో మమ్ముట్టి, మోహన్ లాల్.. ఫొటోలు వైరల్
Theatre Reviews | ఇకపై థియేటర్ల ముందు రివ్యూలకు నో ఛాన్స్.. !
AR Rahman: భార్య సైరాకు బ్రేకప్ చెప్పిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్
Bacchala Malli | ఆ తేదీనే బచ్చలమల్లి.. అల్లరి నరేశ్ రిలీజ్ లుక్ వచ్చేసింది