Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా చిత్రం కంగువ (Kanguva). శివ (Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో సూర్య 42వ సినిమాగా వస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న కంగువ నవంబర్ 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతోపాటు వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
సూర్య టీం ఇప్పటికే ప్రమోషనల్ టూర్లో బిజీగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలో ఫస్ట్ డే వేకువ జామునే 4 గంటల షోలు పడనున్నాయి. ఈ విషయంలో సూర్య అభిమానులు ఆనందంలో ఎగిరిగంతేస్తున్నప్పటికీ.. మరోవైపు హోం స్టేట్ తమిళనాడులో ఉన్న ఫ్యాన్స్ మాత్రం నిరాశలో మునిగిపోతున్నారు. దీనిక్కారణం తమిళనాడులో ప్రభుత్వం వేకువ జామున కంగువ స్పెషల్ షోలకు అనుమతివ్వడకపోవడమే.
అయితే తమిళనాడులో స్క్రీనింగ్స్ ఉదయం 9 గంటల నుంచి మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అదనపు షో వేసుకునేందుకు అవకాశమిచ్చిన తమిళనాడు ప్రభుత్వానికి ధన్వవాదాలు తెలియజేశారు. ఇది మేకర్స్‌కు గుడ్ న్యూస్ అయినప్పటికీ అభిమానులు మాత్రం ఉదయం పూట షోలు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని కోలీవుడ్ సర్కిల్ సమాచారం.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న కంగువ ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
krish jagarlamudi | సైలెంట్‌గా డైరెక్టర్ క్రిష్ వెడ్డింగ్.. ఫొటోలు వైరల్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?