పుష్ప సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు అందుకున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar). స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ను ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అంటూ పేరు పెట్టేశాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో టాలీవుడ్ నిర్మాతలకు కాసుల వర్షం కురిసేలా చేశాడీ లెక్కల మాస్టారు. అల్లు అర్జున్ (Allu Arjun)- కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీతోపాటు పలు భాషల్లో విడుదలై..బాక్సాపీస్‌ను షేక్ చేసింది.
అంతేకాదు సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప 2..ది రూల్ (pushpa 2)పై అంచనాలు కూడా మరింత పెంచేసింది. దీంతో బడ్జెట్ కూడా పెరిగిపోతుందట. ఇదిలా ఉంటే పుష్ప 2కు సుకుమార్ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ గాసిప్ ఫిలింనగర్లో రౌండప్ చేస్తోంది. లేటెస్ట్ గాసిప్ ప్రకారం సుకుమార్ రూ.40 కోట్లు పారితోషికం తీసుకోబోతున్నాడని ఇంట్రెస్టింగ్ టాక్. ఇదే నిజమైతే రాజమౌళి తర్వాత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న రెండో దర్శకుడిగా నిలిచిపోవడం ఖాయమంటున్నారు సినీ జనాలు.
రాజమౌళి సినిమాకు రూ.100 కోట్ల వరకు తీసుకుంటూ..టాప్ ప్లేస్‌లో ఉన్నాడని తెలిసిందే. పుష్ప 2 విషయానికొస్తే..త్వరలోనే సుకుమార్ టీం లొకేషన్ల వేట మొదలుపెట్టనుందట. బన్నీ ఈ పార్టులో డాన్ పాత్రలో కనిపించనుండగా..రష్మిక అతడి భార్యగా కనిపించబోతుందట. మరి పుష్ప 2 ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.