సాహసవీరుడు సాగరకన్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బాలీవుడ్ భామ శిల్పాశెట్టి (Shilpa Shetty). గతేడాది హంగామా 2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ ప్రస్తుతం నికమ్మ (Nikamma) సినిమాపై ఫోకస్ పెట్టింది. తెలుగులో నాని హీరోగా నటించిన ఎంసీఏ చిత్రానికి ఇది హిందీ రీమేక్. కాగా ఈ చిత్రంలో భూమిక పోషించిన పాత్రలో శిల్పాశెట్టి కనిపించబోతుంది. ఈ రాజస్థానీ బ్యూటీ హీరోహీరోయిన్లకు ధీటుగా డ్యాన్స్ చేయబోతుంది.
తాజాగా టైటిల్ ట్రాక్ (Nikamma title song).షూటింగ్ సంబంధించిన వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది శిల్పాశెట్టి. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీలో కంపోజ్ చేసిన ఈ పాట మూవీ, మ్యూజిక్ లవర్స్ లో ఫుల్ జోష్ అందించబోతుందని తాజా వీడియోతో చెప్పేసింది శిల్పాశెట్టి. న్యూజిలాండ్ సింగర్ కమ్ హీరోయిన్ షిర్లే సెటియాకు ఏ మాత్రం తీసిపోని విధంగా డ్యాన్స్ చేసి..థియేటర్లకు వచ్చే జనాలను ఫుల్ ఎంటర్టైన్ చేయబోతుందని కన్ఫామ్ అయిపోయింది.
అభిమన్యు దస్సానీ, షిర్లే సెటియా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి షబ్బీర్ ఖాన్ దర్శకుడు. సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, షబ్బీర్ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూన్ 17న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.